ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఈ పని చేయాల్సిందే..!

First Published Jan 27, 2023, 10:48 AM IST

బిజీ లైఫ్ స్టైల్ వల్ల వ్యాయామం చేయని వారు చాలా మందే ఉన్నారు. శరీరం కదలకుండా ఉంటే.. ఎన్నో రోగాలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో వీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. 
 

walking

శారీరక శ్రమ లేకుంటే లేని పోని రోగాలొచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ నుంచి గుండెపోటు వరకు ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అయితే గజిబిజీ లైఫ్ వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేనివారు వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీకు తెలుసా? వ్యాయామం చేయకున్నా మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి కొన్ని చిట్కాలు ఎంతో సహాయపడతాయి. అందులో నడక ఒకటి. అసలు ఎలా నడవాలి.. ఎప్పుడెప్పుడు నడిస్తే  ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం..

మాట్లాడుతూ నడవండి

అది వర్క్ కాల్ అయినా.. మీ బెస్టీతో ఒక గంట కాల్ అయినా సరే నడుస్తూ మాట్లాడండి. అరగంట వాకింగ్ చేస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే శక్తి స్థాయిలను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. నడక మీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. అందుకే నడుస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోండి.
 

మెట్లు ఎక్కండి

ఫిట్ గా ఉండటానికి మెట్లను ఖచ్చితంగా ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శరీరం మరింత కదలడానికి సహాయపడుతుంది. మీ రోజువారీ జీవితంలో ఎక్కువ కదలడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.  మెట్లను ఎక్కుతున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అలాగే మీ మొత్తం బలాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే లిఫ్ట్ లో వెల్లకుండా మెట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. 

ఎక్కువ కదలడానికి ప్రయత్నించండి 

మీ ఆఫీస్ దగ్గరలో ఉండే నడిచి వెళ్లడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదా ఆఫీసుకు కనీసం 10 నుంచి 20 నిమిషాల దూరంలో దిగి..  అంత దూరం నడిచి వెళ్లండి. ఒకవేళ మీరు కారులో వెళ్తే కొంచెం దూరంలో పార్క్ చేసి మీ ఆఫీసుకు నడిచి వెళ్లండి. లిఫ్ట్ ను తీసుకోకండి. అలాగే మీ ఆఫీసులో మెట్లు ఎక్కండి. మీరు ఎక్కువగా నడుస్తున్నారని, ఫిట్ గా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీ జీవితంలో ఈ చిన్న చిన్న మార్పులు అవసరం మరి.

నిలబడి పనిచేయండి

మీరు పనిచేసే ప్లేస్ లో కన్వర్టిబుల్ డెస్క్  ఉంటే నిలబడి పనిచేయొచ్చు. చూసేవాళ్లు ఏమనుకుంటారనేదాన్ని పట్టించుకోకండి.  అన్నింటికన్నా మీ ఆరోగ్యం ముఖ్యం. ఇలా కొద్దిసేపు నిలబడి పనిచేయడం వల్ల దీర్ఘకాలికంగా మీరు ప్రయోజనం పొందుతారు. అలా అని మరీ ఎక్కువ సేపు నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

టీవీ చూస్తున్నప్పుడు వ్యాయామం చేయండి లేదా శరీరాన్ని సాగదీయండి

టీవీ లేదా సెల్ ఫోన్ లో సినిమాలను చూస్తున్నప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా.. ట్రెడ్ మీల్ పై నడవండి. లేదా సైక్లింగ్ లేదా శరీరాన్ని సాగదీయం వంటి కొన్ని వ్యాయామాలను ఖచ్చితంగా చేయండి. వీటివల్ల మీ శరీరం బాగా కదిలి ఆరోగ్యంగా ఉంటుంది. 
 

ఫిట్నెస్ కోసం డ్యాన్స్ చేయండి

మీకు సమయం దొరికినప్పుడల్లా మీ శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించండి. అన్నింటిలో డ్యాన్స్ బెస్ట్ . ఎందుకుంటే ఇది వ్యాయామంగా అనిపించదు. అందుకే మీకు ఎక్కువసేపు కూర్చోవాలనిపించినప్పుడు మీ  శరీరాన్ని కదిలించడానికి కొన్ని నిమిషాల పాటు డ్యాన్స్ చేయండి. 

click me!