పండ్లపై ఉప్పు జల్లుకుని తింటున్నారా? ఇదెంత డేంజరో తెలుసా?

First Published Dec 9, 2022, 9:43 AM IST

పండ్ల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే చాలా మంది వీటిని చిరుతిండిగా కూడా తీసుకుంటారు. అయితే చాలా మంది పండ్లను కట్ చేసి వాటిపై ఉప్పు జట్టుకుని తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక సిట్రస్ పండ్లు రుచిలో బాగుంటాయి. ఈ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ పండ్లను ఒక్కొక్కరూ ఒక్కోలా తింటుంటారు. కొంతమంది పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిపై ఉప్పు జల్లుకుని తింటుంటారు. ఇంకొందరు జ్యూస్ ను తయారుచేసుకుని తాగుతుంటారు. పండ్ల ముక్కలపై ఉప్పు జల్లుకుని తింటే బలే టేస్టీగా ఉంటుంది. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికలుగుతుంది. ఎందుకంటే దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సోడియం పరిమాణం పెరుగుతుంది

పండ్లపై ఉప్పు జల్లుకుని తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. గుండెపోటు, స్ట్రోక్, గుండెకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా రావొచ్చు. అందుకే పండ్లపై ఉప్పును జల్లడం మానుకోవాలి.  

fruits

మూత్రపిండాల సమస్యలు

ఉప్పును ఎక్కువగా తినడం మూత్రపిండాల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల పనితీరు సరిగ్గా ఉండదు. మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు పండ్లను ఎక్కువగా తింటుంటారు. ఈ పండ్లకు ఉప్పును కలిపితే మీ పరిస్థితి మరింత దిగజారుతుంది. కిడ్నీ వ్యాధి ఉంటే మీరు తినే ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం మంచిది. 
 

ఉబ్బరం సమస్యలు

శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువైతే.. మీ బాడీలో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది. సోడియం కంటెంట్ ఎక్కువైతే మన బాడీ నిర్విషీకరణ చేయబడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

పోషకాలు ఉండవు

పండ్లపై ఉప్పును జల్లుకుని తినడం వల్ల మన శరీరానికి పండ్ల నుంచి పూర్తి పోషకాలు అందవు. ఎందుకంటే ఉప్పును జల్లడం వల్ల పండ్ల నుంచి నీరంతా బయటకు పోతుంది. అలాగే పోషకాలు కూడా తగ్గుతాయి. ఉప్పును ఎక్కువగా ఎక్కువగా తింటే శరీరంలో పోషకాలు సరిగ్గా గ్రహించబడవు. 

రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన రక్తపోటును పెంచుతుంది. చర్మ వ్యాధులకు కూడా కారణమవుతుంది.

click me!