మంకీపాక్స్ నుంచి త్వరగా కోలుకోవాలంటే వీటిని తినండి..

First Published Aug 7, 2022, 4:23 PM IST

Health Tips: మన దేశంలో  మంకీపాక్స్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే అనుకోకుండా మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ బారిన పడితే.. ఈ ఆహారాలను తినండి. త్వరగా కోలుకుంటారు. 
 

ఇప్పటికే కరోనాతో ప్రపంచ దేశాలన్ని ఎంతో నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మంకీపాక్స్ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంకీపాక్స్ సంక్రమణ కరోనా వైరస్ లాగే విస్తృతంగా వ్యాపిస్తున్నది. ప్రతి ఐదుగురిలో ఒకరు అమెరికన్లు మంకీపాక్స్ బారిన పడటం ఆందోళనకరమని అన్నన్బర్గ్ పబ్లిక్ పాలసీ సెంటర్ నిర్వహించిన జాతీయ సర్వే తెలిపింది. వాస్తవానికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.  అయితే ఒకవేళ మీరు దీని బారిన పడితే ఆందోళన చెందకుండా మంచి పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పోషకాహారమే దీని  నుంచి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. దీనికోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

protein rich foods

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్

ప్రోటీన్ మన శరీరానికి ఎంతో అవసరం.  ప్రోటీన్ ఫుడ్ తోనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అయితే మంకీపాక్స్ బారిన పడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ప్రోటీన్ ఫుడ్ ను తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.  అంతే కాదు ఇది సెల్ నష్టాన్ని మరమ్మతు చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం కాటేజ్ చీజ్, సోయా, పెరుగు, గింజలు, కాయధాన్యాలు, ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఇవి మంకీపాక్స్ సోకిన వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో ఎన్నో ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుడ్డులో ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, కోలిన్, ఐరన్  వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను  ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరానికి శక్తిని అందించి.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఉండే సెలీనియం ఆక్సీకరణ నష్టాన్ని, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. 
 

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన తెల్ల రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. వ్యాధి, సంక్రమణల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. బొప్పాయి, నిమ్మ, కివి, నారింజ, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, ఉసిరికాయ, వంటి పండ్లను ఎక్కువగా తినాలి. 
 

పుదీనా

పుదీనాలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పుదీనాలో ఉండే మిథనాల్ కండరాలను, జీర్ణవ్యవస్థను సడలించడానికి సహాయపడుతుంది. ఉబ్బసం, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

తులసి ఆకులు

తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు తులసి ఆకుల్లో సాధారణ ఫ్లూ లక్షణాలను తగ్గించే గుణాలుంటాయని నిరూపించబడింది. 
 

ఏ ఆహారాలు తినకూడదు

స్పైసీ ఫుడ్స్ ను, జంక్ ఫుడ్ ను అసలే తినకూడదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. 
 

click me!