పల్లీలు తింటే బరువు పెరుగుతరా?

First Published Dec 26, 2022, 9:45 AM IST

నిజానికి పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో కొవ్వు, కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని తింటే బరువు పెరిగిపోతామని చాలా మంది భావిస్తుంటారు. ఇందులో నిజమెంతుందో తెలుసా? 

ఊబకాయులు, అధిక బరువున్న వాళ్లు పల్లీలను తినడానికి బయపడుతుంటారు. ఎందుకంటే వేరుశెనగలను తినడం వల్ల బరువు పెరుగుతారని. కానీ దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి.  

100 గ్రాముల వేరుశెనగలో 567 కేలరీలు, 25 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల కార్బోహైడ్రేట్, 50 గ్రాముల కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా వేరుశెనగలో ఫైబర్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లం కూడా పుష్కలంగా వేరుశెనగలో  కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ పోషకవిలువలు ఎక్కువగా ఉండే పదార్థాలను తినకపోవడానికి కారణాలు లేకపోలేదు. 
 

వేరుశెనగ ప్రోటీన్ కు మంచి మూలం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేరుశెనగలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. వేరుశెనగలోని ప్రోటీన్ కంటెంట్ మొత్తం కేలరీలలో దాదాపుగా 25 శాతంగా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ కు మంచి వనరుగా మారుతుంది.
 

వేరుశెనగ ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది

ఈ గింజలలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీని వల్ల మీరు ఫుడ్ ను అతిగా తినలేరు. ఈ గింజలు ఆకలిని నియంత్రిస్తాయి. అందుకే వీటిని బరువు తగ్గడానికి తీసుకోమని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు.  అయితే ఈ గింజలను తినే వ్యక్తులు, కొవ్వు అధికంగా ఉన్నవారు కూడా.. వాటిని తినని వ్యక్తుల కంటే కాలక్రమేణా తక్కువ బరువు పెరుగుతారని అధ్యయనాలు కనుగొన్నాయి. జంక్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ కు  ప్రత్యామ్నాయంగా ఈ గింజలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేయడానికి ఇవే కారణాలు.
 

వేరుశెనగలు ఇతర గింజలలాగే పోషకమైనవి

వేరు శెనగలను పేదవాడి బాదం గింజలు అని కూడా అంటారు. బాదం గింజలు చాలా ఖరీదైనవి. వీటిలోనే పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది తప్పుడు ఊహ. 

వేరుశెనగలు భారతదేశంలో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి విదేశాలలో లభించే ఇతర గింజలలాగే చాలా పోషకమైనవి. అందుకే బాదం తినని వారు తినే వారు కూడా వేరుశెగలను తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.  బెల్లంతో చేసిన పల్లీ పట్టీలను తినొచ్చు. వీటిని రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 
 

పరిమితిలోనే తినాలి

వేరుశెనగలను తింటే కొంతమందికి అలెర్జీ సమస్య వస్తుంటుంది. ఇది తీవ్రమైన అలెర్జీలలో ఒకటిగా పరిగణించబడుతుంది కూడా.

వేరుశెనగలో అరచిన్, కొనారాచిన్ అనే రెండు ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తినేటప్పుడు చాలా మందికి  ప్రాణాంతక అలెర్జీ వస్తుంది. 

అయితే వేరుశెనగ చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా అలెర్జీలకు కారణమవుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు. వేరుశెనగ తినేటప్పుడు మాత్రమే అలెర్జీ  వచ్చే ఛాన్స్ ఉంది. 

click me!