నానబెట్టిన ఖర్జూరాలను తింటే సెక్స్ సామర్థ్యం పెరగడమే కాదు.. ఆ సమస్యలు కూడా తగ్గిపోతయ్..

First Published Dec 6, 2022, 4:55 PM IST

ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. దీనిలో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ మీ శరీరంలో రక్తం కొరతలేకుండా చేస్తుంది. అలాగే సెక్స్ సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఖర్జూరాల్లో ఉన్నాయి.

ఖర్జూరాలను కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. దీనిలో పుష్కలంగా ఉండే పోషకాలు ఎన్నో వ్యాధులను తగ్గుతాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఖర్జూరాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. అంతెందుకు మధుమేహుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. వీటిని తినడం వల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్ గా పనిచేస్తారు. ఇన్ని ప్రయోజనాలను కలిగి ఉన్న ఖర్జూరాలను ‘ఆరోగ్య సంపద’ అని కూడా అంటారు. 
 

ఖర్జూరాల్లో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో కార్భోహైడ్రేట్లు, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, జింక్, విటమిన్లు, మాంగనీస్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే ఐరన్ కంటెంట్ మన శరీరంలో రక్తం స్థాయిలను పెంచుతుంది. రక్తం లోటు ఏర్పడకుండా చూస్తుంది. ఖర్జూరాలను అలాగే కాకుండా నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో తెలుసుకుందాం.. 

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి వల్ల చాలా మంది పురుషుల్లో లైంగిక సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల వారి వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా సంతాన సమస్యలు. దీనికి కారణం స్పెర్మ్ కౌంట్ తగ్గడం. ఇలాంటి వారు ప్రతిరోజూ పాలలో నానబెట్టిన 4 ఖర్జూరాలను తింటే శరీరంలో శక్తి పెరుగుతుంది. వీర్యకణాల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. దీంతో పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువుంటాయి. 
 

dates

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ గా ఉదయం పూట పరిగడుపున కొన్ని ఖర్జూరాలను తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఖర్జూరాలు కడుపు నొప్పి, గ్యాస్, మలబద్దకం, అజీర్థ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లల్లో మలబద్దకం సమస్య పోవాలంటే ప్రతిరోజూ 2 నుంచి 3 ఖర్జూరాలను నానబెట్టి ఇవ్వండి. 

dates

ఖర్జూరాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా పాలలో నానబెట్టిన 4 ఖర్జూరాలను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. పైల్స్ తో బాధపడేవారికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాలు ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తాయి. 

dates

ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ ఉండదన్న ముచ్చట అందరికీ.. దీనిలో చాలా తక్కువగా కొవ్వు ఉంటుంది. ఖర్జూరాలను మోతాదులో తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందుకే ఈ రోజు నుంచి వీటిని మీ ఆహారంలో చేర్చండి. 

ఖర్జూరాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.  మీ శరీరంలో ప్రోటీన్ల లోపం ఏర్పడకూడదంటే రోజుకు నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తినండి. ఖర్జూరాలు ప్రోటీన్లకు బలమైన మూలం. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండటానికి, కండరాలను బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. రెగ్యులర్ జిమ్ కు వెళ్ళేవారు ప్రతిరోజూ ఖర్జూరాలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

ఖర్జూరాలు మీ ఎముక ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఖర్జూరాల్లో సెలీనియం, మాంగనీస్, రాగి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఇవన్నీ చాలా అవసరం. 

click me!