తలనొప్పి ఎక్కువొస్తే ఈ సమస్య ఉన్నట్టేనా..?

First Published Oct 4, 2022, 4:03 PM IST

గుండె జబ్బులు ఉంటే కూడా తలనొప్పి తరచుగా వస్తుంటుంది. అయితే ఉన్నట్టుండి తలనొప్పి వచ్చి వారం రోజులపాటు ఉన్నట్టైతే అది ప్రమాదకరమైన జబ్బుకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. 
 

పని ఒత్తిడి, డిప్రెషన్, కొన్ని రకాల వ్యాధులు తలనొప్పికి కారణమవుతాయి. అయితే ఈ తలనొప్పి గుండె జబ్బులకు సంకేతమని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరికైతే ఉన్నట్టుండి తలనొప్పి స్టార్ట్ అయ్యి..  వారం రోజుల పాటు కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 
 

headache

ఈ రోజుల్లో హార్ట్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏండ్లకు పైబడిన వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు 25 ఏండ్ల వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్ అప్పటికి అప్పుడు వచ్చే సమస్య కాదు. చెడు ఆహారాలు, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతంది. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఇక అసలు విషయానికొస్తే మీకు గుండె జబ్బులు ఉంటే తలనొప్పి తరచుగా వచ్చి వారంకి పైగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఉన్నట్టుండి తలనొప్పి రావడం గుండె సమస్యలకు సంకేతమే కాదు.. మైగ్రేన్ నొప్పికి కూడా కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ మైగ్రేన్ సమస్య అంత సులువుగా వదిలిపోదు. ఇది రక్తపోటు తక్కువగా ఉంటే వస్తుంది. ఈ సమస్య రాను రాను డిప్రెషన్ కు, గుండెపోటుకు దారితీస్తుంది. 
 

మైగ్రేన్ రకాలు

మైగ్రేన్ ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలుగా ఉంటుంది. ఇక దీనిలో ప్రైమరీ మైగ్రేన్ దేనివల్ల వస్తుందో స్పష్టంగా తెలియదు కానీ.. సెకండరీ మైగ్రేన్ మాత్రం కొన్ని రకాల జబ్బులు, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల వస్తుంది.

దీర్ఘకాలిక మైగ్రేన్ చాలా డేంజర్

మైగ్రేన్ సమస్య నుంచి పూర్తిగా బయటపడటం అంత సులువు కాదు. అందుకే దీన్ని దీర్ఘకాలిక సమస్య అంటారు. ఈ సమస్య 20 ఏండ్ల నుంచి 40 ఏండ్ల వారికే వస్తుంది. ఈ మైగ్రేన్ నొప్పి మగ వారితో పోల్చితే ఆడవారికే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీళ్లలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ సమతుల్యంగా ఉండవు. దీంతో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. 


మైగ్రేన్ రావడానికి గల కారణాలు

మైగ్రేన్ సమస్య రావడానికి ఇంకా స్పష్టమైన కారణం తెలియదు. అయితే జీవన శైలి సరిగ్గా లేకపోడం, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, నిద్రలేమి. ఒత్తిడి, అతిగా నిద్రపోవడం, ఊబకాయం, అధిక బరువు, రక్తపోటు తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం, నరాల సమస్యలు వంటి సమస్యల వల్ల మైగ్రేన్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మితిమీరి ఆల్కహాల్ ను తాగడం, స్మోకింగ్ చేయడం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. ఇక ఆడవారిలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటే కూడా మైగ్రేన్ సమస్య వస్తుంది. 
 

కొన్ని రకాల ఆహారాలు కూడా మైగ్రేన్ నొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. పులియబెట్టిన ఆహారాలు, కాఫీ, టీ, ప్రాసెస్ చేసిన ఫుడ్, చాక్లెట్స్,  చల్లగా ఉండే ఆహారాలు, మరీ వేడిగా ఉండే ఆహారాలు, చీజ్, పుట్టగొడుగులు మైగ్రేన్ నొప్పిని ఎక్కువ చేస్తాయి. నిద్రలేకున్నా వస్తుంది. వారం రోజుల కంటే తలనొప్పి ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.

click me!