కొవ్వుతో బరువుకు చెక్..

First Published Dec 13, 2020, 9:54 AM IST

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా దూరంగా పెట్టేది కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలనే. వీటిమీద ఎన్నో అపోహలు, అనుమానాలున్నాయి. కొవ్వు పదార్ధాలతో ఎక్కువ శక్తి అందుతుందని, దాని వల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. 

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా దూరంగా పెట్టేది కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలనే. వీటిమీద ఎన్నో అపోహలు, అనుమానాలున్నాయి. కొవ్వు పదార్ధాలతో ఎక్కువ శక్తి అందుతుందని, దాని వల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు.
undefined
అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువ కెలరీలు, కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు అనుకుంటారు. కానీ మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం మర్చిపోకూడదు.
undefined
అంతేకాదు శారీరక, మానసిక ఆరోగ్యానికి కొవ్వు పదార్థాలు ఎంతో అవసరం. ఇవి తగిన మొత్తంలో శరీరానికి అందకపోతే.. కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం శోషించుకోలేదు. అందువల్ల జీవక్రియలు సరిగా జరగడానికి, ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన హెల్తీ డైట్ పై దృష్టి పెట్టాలి.
undefined
హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చాలి. బరువు తగ్గడానికి సహాయపడే గుడ్లు, చేపలు, డార్క్ చాక్లెట్, కొబ్బరి, అవొకాడో వంటి ఆహార పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి.
undefined
గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుతామని చాలామంది అనుకుంటారు. కానీ ఇదో పెద్ద అపోహ. బరువు తగ్గాలనుకునేవారు నిక్షేపంగా గుడ్డు మొత్తాన్ని తీసుకోవచ్చు. ఎగ్ వైట్‌లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. గుడ్డు సొనలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఈ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.
undefined
సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపల్లో కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఈ సముద్రపు చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో కాలరీలు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఈ సముద్రపు చేపల్లో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్.. ఆకలిని నియంత్రిస్తుంది.
undefined
బరువు తగ్గడంలో డార్క్ చాక్లెట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు కొన్ని రకాల డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్లను స్వచ్ఛమైన కోకోవాతో తయారు చేస్తారు. దీంట్లో ఉండే కొకోవా బటర్ ఆకలిని నియంత్రిస్తూ, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంట్లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కవగా ఉంటాయి. ఇవి రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
undefined
కొబ్బరిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ఆహారపదార్థాల తయారీలో వాడడానికి గానీ, కొబ్బరి నూనెతో వంటకాలు చేయడం ద్వారా బరువు పెరుగుతారని భయపడతారు. అయితే ఇది కేవలం అపోహనే. కొబ్బరిలో ఉండే ఎక్కువ మొత్తంలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
undefined
కొబ్బరిలో ఉండే ల్యూరిక్ ఆసిడ్ హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది. పొట్టచుట్లూ పేరుకుపోయే ప్రమాదకరమైన కొవ్వులను తగ్గించే గుణం కొబ్బరికి ఉంటుంది.
undefined
అవకాడోలో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వీటిల్లో అధికమొత్తంలో ఉండే ఫైబర్, ప్రోటీన్ వంటివి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా ఇవి కాపాడతాయి.
undefined
click me!