భారత్ లో ఉన్న ఈ ఆహ్లాదకరమైన ప్రదేశాల గురించి మీకు తెలుసా?

First Published Nov 17, 2021, 3:04 PM IST

ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రకృతి అందాలను కలిగిన దేశాలలో భారతదేశం (India) ఒకటి. ఈ ప్రకృతి అందాలు పర్యాటకులకు కనువిందు కలిగిస్తాయి. భారతదేశంలో అనేక అందమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వీటిని చూడడానికి ప్రతియేటా భారత దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అలాంటి కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..
 

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చాలా అందంగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో అవి వెలుగులోకి వచ్చాయి. ఈ అందమైన ప్రాంతాలు ఆ రాష్ట్ర చరిత్రనూ (Historical), రహస్యాలని (Secrets), అద్భుతమైన విషయాలను తెలియజేస్తాయి. అలాంటి వాటిలో త్రిపుర, నాగాలాండ్, జార్ఖండ్, ఛతీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

అరుణాచల్ ప్రదేశ్: అరుణాచలప్రదేశ్ (Arunachal pradesh) ఈశాన్య భారతదేశంలోని ఒక అద్భుతమైన ప్రాంతం. దీన్ని ఆర్కిడ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అరుణాచల్ ప్రదేశ్ సహజ సౌందర్యాన్ని కలిగి ప్రకృతి (Nature) ప్రేమికులకు స్వర్గంలా అనిపిస్తోంది. అరుణాచల ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడి జలపాతాలు, కొండలు, దట్టమైన అడవులు పర్యాటక ప్రియులను కనువిందు చేస్తాయి. ఇక్కడి అనేక లోయ ప్రాంతాలు, పాత స్మారక చిహ్నాలు  పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. 
 

త్రిపుర: త్రిపుర (Tripura) భారతదేశంలోని అత్యంత అక్షరాస్యత (Literacy) కలిగిన రాష్ట్రం. ఇక్కడి అందమైన పచ్చదనం పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ సుందర ప్రాంతంలో అనేక కొండ ప్రాంతాలు, లోయలు, దట్టమైన మైదానాలు, సాంస్కృతిక వైవిధ్యం, జానపద కళలు పర్యాటకులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈశాన్య భారతదేశపు కొండ దేశమైన త్రిపుర ఏడు రాష్ట్రాలలో ఒకటి. 
 

జార్ఖండ్: జార్ఖండ్ (Jharkhand) అటవీ భూమిగా (Forest land) ప్రసిద్ధి చెందింది. జార్ఖండ్ లో ఎటు చూసిన అందమైన సహజసిద్ధమైన అడవులు దర్శనమిస్తాయి. భారతదేశంలోని అంతరించిపోతున్న అనేక జాతులను ఈ అడవులలో చూడవచ్చు. ఇక్కడ హోండ్రు వంటి అందమైన జలపాతాలతో పాటు ప్రజల సాంప్రదాయ జీవనశైలిని అన్వేషించవచ్చు. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాణిజ్యవాదానికి దూరంగా తన సహజ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది.
 

నాగాలాండ్: నాగాలాండ్ (Nagaland) అనేక రకాల సంస్కృతి సంప్రదాయాల జీవనశైలిని కలిగి ఉంటుంది. నాగాలాండ్ గొప్ప వృక్ష సంపదను (Vegetation) కలిగి తన సహజ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ నివసించే వారి రోజు వారి జీవన విధానాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మొత్తం 16 స్వదేశీ నాగ గిరిజనులు తమ సొంత భాష, ఆచారాలతో ఇక్కడ నివసిస్తున్నారు.
 

ఛతీస్ గడ్: ఇక్కడి సిర్పూర్ పురాతన శిధిలాలు, కైలాస గృహాలు ఛతీస్ గడ్ సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఛత్తీస్‌గఢ్ భారత దేశానికి అతిపెద్ద విద్యుత్ ఉక్కు వనరు (Resource). ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు  ఉన్నాయి. పురాతన కోట్లతో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. ఛత్తీస్‌గఢ్ ఇది ఒక అటవీ ప్రాంతం. ఎటు చూసినా కొండలు, అడవులు, లోయలతో (Valley) పర్యాటకులను కనువిందు చేస్తాయి.

click me!