మీ సెక్స్ లైఫ్ బాగుండాలంటే.. దీని ఆరోగ్యం కూడా బాగుండాల్సిందే..!

First Published Dec 22, 2022, 9:59 AM IST

లైంగిక ఆరోగ్యం మీ గట్ హెల్త్ పై ఆధారపడి ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? అవును గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే లైంగికంగా చురుగ్గా ఉండటం, సంతానోత్పత్తి మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

gut health

గట్ కేవలం జీర్ణక్రియ, శోషణ, విసర్జన వంటి పనులనే కాదు.. మన శరీరంలో మరెన్నో విధులను కూడా నిర్వర్తిస్తుంది. మన శరీర ఆరోగ్యం మొత్తం గట్ హెల్త్ పైనే ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడం నుంచి మీ మానసిక, భోవోద్వేగ స్థితిని మెరుగుపర్చడం వరకు ఎన్నో పనులను చేస్తుంది. అంతేకాదు హార్మోన్ల సంశ్లేషణ, వ్యర్థాల విసర్జన వంటి పనులన్నీ దీని ద్వారే నియంత్రించబడతాయి. అంతేకాదు.. ఇది మీరు లైంగికంగా ఆరోగ్యంగా బాగుండటానికి, గర్భం ధరించే సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. 

మంచి, చెడు బ్యాక్టీరియా అంటే ఏంటి? 

మన జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా.. ప్రధానంగా పెద్ద పేగు, మీ గట్ మైక్రోబయోమ్ ను ఏర్పరుస్తుంది. మన గట్ బ్యాక్టీరియాలో 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా కణాలు ఉంటాయి. ఇవి మీ మొత్తం శరీరం కణాల కంటే చాలా ఎక్కువ. వీటిలో అనారోగ్యకరమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కానీ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి, మెదడుకు న్యూరోట్రాన్స్ మీటర్లను పంపడానికి, మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దీనిలో ఎన్నో రకాల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. గట్ ఆరోగ్యం బాగాలేకపోతే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం, విరేచనాలు, పీరియడ్స్ సమస్యలు వస్తుంటాయి. 

గట్ ఆరోగ్యం లైంగిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెక్స్ లైఫ్ బాగుండటానికి గట్ ఆరోగ్యం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీ సెక్స్ హార్మోన్ల నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం..ఆరోగ్యకరమైన సూక్ష్మజీవి లేనప్పుడు ఈస్ట్రోజెన్ సరిగ్గా ఉత్పత్తికాదు. దీంతో ఎండోమెట్రియోసిస్, పిసిఒఎస్, ఎండోమెట్రియల్ హైపర్ ప్లాసియా, వంధ్యత్వం తో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. 

ఇంకా పలు అధ్యయనాల ప్రకారం..  మైక్రోబయోమ్ అసమతుల్యత వల్ల  తామర, ఉబ్బసం, అలెర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ గర్భధారణ సమయంలో తల్లిని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పిల్లల దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే తాపజనక ప్రతిస్పందన, ఆరోగ్యకరమైన బరువు ఉండటానికి కూడా సహాయపడుతుంది. పేలవమైన మైక్రోబయోమ్ మీ లైంగిక ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. అవేంటంటే..
 

gut

వాపు

కడుపులోని మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తే లేదా చెడు బ్యాక్టీరియా  పెరిగిపోతే.. సూక్ష్మజీవుల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అసమతుల్యత దీర్ఘకాలిక తాపజనక ప్రతిస్పందనలకు దారితీస్తుంది. ఇది తక్కువ నాణ్యత గల గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మహిళల్లో పిండం అభివృద్ధిని పరిమితం చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ బరువు ఉన్నవారిలో లేదా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో.. అందుకే మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలి. దీనివల్ల మంట తగ్గుతుది. సంతానోత్పత్తి కూడా పెరుగుతుంది. 
 

యోని ఆరోగ్యం

గట్ మైక్రోబయోమ్ కూడా యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నిజానికి  యోనిలో సహజంగా గట్ లో ఉన్న అదే ప్రోబయోటిక్ జాతులు ఉంటాయి. ఇది లాక్టోబాసిల్లి లాక్టిక్ ఆమ్లాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది యోని పిహెచ్ ను తగ్గిస్తుంది. అలాగే ప్రమాదకరమైన వ్యాధికారకాలు అక్కడ వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. తరచుగా థ్రష్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు లేదా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు రావడం మీ గట్ సరిగా పనిచేయడం లేదని చెప్పే సూచికలు కావచ్చు. యోని సూక్ష్మజీవికి అంతరాయం కలిగితే సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుంది.
 

gut

ఈస్ట్రోజెన్ జీవక్రియ

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ గట్ ఆరోగ్యం ఈస్ట్రోజెన్ హార్మోన్ ను ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఇది మగ, ఆడ పునరుత్పత్తి ఆరోగ్యం, సంతానోత్పత్తి రెండింటికీ కీలకమైనది. గట్ మైక్రోబయోమ్ ఈస్ట్రోజెన్ ను నియంత్రించే ప్రాధమిక విధానాలలో ఒకటి బీటా-గ్లూకురోనిడేస్ అని పిలువబడే ఎంజైమ్. కానీ గట్ మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే ఈ విధానం బలహీనపడే ఛాన్స్ ఉంది. ఈస్ట్రోజెన్ నిర్విషీకరణకు ఆటంకం కలిగిస్తుంది.

మహిళల్లో ఎండోమెట్రియోసిస్ లేదా పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్, పురుషులలో వీర్య ఉత్పత్తి తగ్గడం వంటి పునరుత్పత్తి ఆరోగ్యం, వంధ్యత్వాన్ని ప్రభావితం చేసే రుగ్మతలు ఈస్ట్రోజెన్ స్థాయిలు మరీ ఎక్కువగా పెరగడం వల్ల తలెత్తుతాయి. 
 

click me!