మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఏ డ్రెస్ అయినా సరే.. ఒక్కసారి ఉతకగానే ముడతలు వచ్చేస్తాయి. మళ్లీ ఆ ముడతలు పోయి.. కొత్తగా, నీట్ గా కనిపించాలి అంటే.. ఆ డ్రెస్ కి ఐరన్ అవసరం.
అయితే.. ఒక్కోసారి కొన్ని డ్రెస్సులు నీట్ గా ఐరన్ చేసినా కూడా.. ముడతలు అలానే ఉంటాయి. కొన్ని ముడతలు మాత్రం పోకుండా అలానే ఉండిపోతాయి. అలాంటి వాటిని కూడా పోగొట్టాలంటే.. ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే. అవేంటో ఓసారి చూద్దాం..
దుస్తులు సరిగ్గా ఉతకకపోతే, ఆరిన తర్వాత పాడైపోతాయి. ఆ తర్వాత బట్టలను ఎంత ఐరన్ చేసినా అవి మళ్లీ మామూలుగా మారవు. అటువంటి పరిస్థితిలో, మీరు కనీసం 3 సార్లు నీటితో దుస్తులు ఉతకాలి. దీని తరువాత మీరు దానిని సరిగ్గా పిండి వేయాలి . ఆ తర్వాత ఎండపెట్టాలి. ఇలా చేయడం వల్ల ముడతలు తొలగిపోయి, ఆరిన తర్వాత బట్టలు చెడిపోకుండా ఉంటాయి.
కొన్ని దుస్తులు ఎంత గట్టిగా నొక్కి ఐరన్ చేసినా ముడతలు పోవు. అలాంటి సమయంలో.. ఆ దుస్తులపై కాస్త నీరు చల్లి.. ఆ తర్వాత ఐరన్ చేస్తే.. ముడతలు సులభంగా ఉంటాయి.
చాలా మంది ఒకేసారి ఎన్నో బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. తర్వాత నెమ్మదిగా అవసరం అయినప్పుడు వేసుకుంటారు. ాకనీ ఇలా చేయకూడదు. మీరు ఒక సమయంలో ఒక వస్త్రాన్ని ఇస్త్రీ చేయాలి. ఒకేసారి ఎక్కువ దుస్తులను కూడా ఐరన్ చేయకూడదు. అవసరమైనప్పుడు ఏది అవసరం అయితే.. దానిని ఐరన్ చేసుకోవడం ఉత్తమం. మన ఇంట్లో ఉండే ఐరన్ బాక్సులు ఎక్కువ బరువు ఉండవు కాబట్టి.. ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి చేసుకోవడం బెటర్.