గడ్డిమీద వాకింగ్.. ఉత్తకాళ్లతో నడిస్తే ఎన్ని ప్రయోజనాలో...

First Published Jul 24, 2021, 3:02 PM IST

చెప్పులు, షూలు వేసుకోకుండా ఉత్త పాదాలతో వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అయితే ఈ వాకింగ్ రోడ్డుమీదో, కాలనీ గ్రౌండ్ లోనో చేయడం కాదు. పచ్చగడ్డి మీద నడవాలని చెబుతున్నారు. అది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, దానివల్ల చాల మేలు జరుగుతుందని చెబుతున్నారు. 

మార్నింగ్ వాక్ కి వెడుతున్నారా? మంచి షూస్, ట్రాక్ సూట్ వేసుకుని రెడీ అయ్యారా? వాకింగ్ అనగానే 99శాతంమంది చేసే పని ఇదే. అయితే షూస్ లేకుండా.. కాళ్లకు ఏమీ వేసుకోకుండా వాకింగ్ ఎప్పుడైనా చేశారా? అదెలా అంటారా?
undefined
చెప్పులు, షూలు వేసుకోకుండా ఉత్త పాదాలతో వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అయితే ఈ వాకింగ్ రోడ్డుమీదో, కాలనీ గ్రౌండ్ లోనో చేయడం కాదు.
undefined
పచ్చగడ్డి మీద నడవాలని చెబుతున్నారు. అది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, దానివల్ల చాల మేలు జరుగుతుందని చెబుతున్నారు.
undefined
రోజూ మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల శరీరం ఫిట్‌గా ఉండి అనారోగ్యాలు దరిచేరవు. వాకింగ్ అనగానే అంతా చెప్పులు లేదా షూలు వేసుకుని నడుస్తారు. అయితే, అప్పుడప్పుడు చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనట.
undefined
ఉదయాన్నే ఉత్త కాళ్లతో వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. అయితే.. ఉత్త పాదాలతో నడిచేప్పుడు.. రాళ్లు తేలిన రోడ్లపై కాకుండా.. పచ్చని పచ్చికపై, మెత్తని ఇసుకపై, మట్టిపై నడవమని చెబుతున్నారు.
చెప్పులు వేసుకోకుండా ఉత్త పాదాలతో నడిస్తే.. మెదడుకు మంచిదని ఓ అధ్యయనంలో పేర్కొన్నారు.
undefined
అయితే, ఇంట్లో నేలపై లేదా సిమెంటు రోడ్లపై నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రకృతి ప్రసాదించిన మట్టిలో, గడ్డిపై మాత్రమే నడవండి. మీ కాళ్లకు చాలా హాయిగా కూడా అనిపిస్తుంది.
undefined
నగరాల్లో మట్టి, గడ్డి నేలని వెతుక్కోవడం కొంచెం కష్టమే. కాబట్టి.. మీ దగ్గర్లో ఏదైనా పార్క్‌కు వెళ్లండి. రోజూ కుదరకపోయినా.. రోజుకు ఒక్కసారైనా సరే పార్కులో ఉత్త పాదాలతో వాకింగ్ చేయండి.
undefined
దీనివల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. మోకాళ్ల నొప్పులు సైతం మాయమవుతాయి. కండరాల బలహీనత, మధుమేహం సమస్యతో బాధపడేవారికి కూడా ఈ నడక మంచిదే.
undefined
కాబట్టి.. ఈ రోజు నుంచే చెప్పులకు బై బై చెప్పేసి.. ఉత్త పాదాలతో నడిచేయండి.
undefined
click me!