Baldness: ఈ మిస్టేక్స్ చేయడం వల్లే మగవారికి బట్టతల వస్తుందట..

First Published Jan 15, 2022, 3:10 PM IST

Baldness And Hair Loss: తెలియక చేసిన కొన్ని పొరపాట్లే మగవారిలో బట్టతల సమస్య వస్తుంది. ఆ తప్పుల వల్లే చిన్న చిన్న వయసు వారు కూడా హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. అసలు వాళ్లు చేసే తప్పులేంటో తెలుసా..? 
 

Baldness And Hair Loss: అమ్మాయిలైనా.. అబ్బాయిలకైనా జుట్టుంటునే అందం.. ఆనందం. అందుకే జుట్టుపై స్పెషల్ కేరింగ్ చూపిస్తుంటారు. జుట్టు నిగనిగ మెరిసిపోవడానికి, పొడుగ్గా కావడానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ను షాంపులనూ విచ్చల విడిగా వాడుతుంటారు. మరికొందరైతే ఇంటి చిట్కాలతో జుట్టును పొడుగ్గా , పట్టుకుచ్చులా మెరిసిపోవాలని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ ప్రాసెసెలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది. అమ్మాయిల్లో హెయిర్ ఫాల్ సమస్య కొంత బాధించినా..  అమ్మాయిల్లో బట్టతల, హెయిర్ ఫాల్ సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే ఈ బట్టతల కొందరికి వంశపారంపర్యంగా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే కాకుండా షాంపు యూజ్ చేసే పద్దతులు కూడా బట్టతలకు కారణమవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాళ్లు చేసే కొన్ని పొరపాట్లే Hair fall,బట్టతలకు కారణమవుతుందట. అందుకే చిన్న వయసు వారికి కూడా జుట్టు ఊడిపోతుందట. 

జుట్టుకు పట్టిన జిడ్డు, దుమ్ము, దూళి పోవాలని షాంపునూ పెట్టడం సహజం. అయితే చాలా మంది మగవారు ప్రతిరోజూ జుట్టుకు షాంపునూ పెడుతుంటారు. మీరు కూడా అలాగే పెడుతున్నారా..? అయితే అంతే సంగతి. ఎందుకంటే ప్రతి రోజూ జుట్టును క్లీన్ చేసుకోవడానికి షాంపునూ వాడితే మీ జుట్టు గరుకుగా మారుతుంది. ముుఖ్యంగా అలా చేయడం వల్ల జుట్టు రాలే ప్రమాదం ఉంది. దానికి తోడు మీ జట్టు నిర్జీవంగా మారుతుందని పలువురు నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అందుకే జుట్టు జిడ్డుగా మారినప్పుడు మాత్రమే షాంపును పెట్టండి. లేదంటే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయే ప్రమాదం ఉంది. మీ కేరింగ్ తోనే మీ జుట్టు భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి. 
 

చలికాలం, ఎండాకాలం, వానాకాలం అంటూ తేడాలు లేకుండా కొంతమంది వేడినీళ్లతోనే Head bath చేస్తుంటారు. అవే ఎందుకంటే ఇవి జుట్టుకు చాలా మంచిదని చెబుతుంటారు. కానీ వేడి నీళ్లు జుట్టుకే కాదు శరీరానికి కూడా అంత మంచిది కాదు.  చల్ల నీళ్లతో స్నానం చేయడం కష్టమనిపిస్తే గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయండి. గోరు వెచ్చటి నీళ్ల వల్ల జుట్టుకు ఎలాంటి సమస్య రాదు. అలాగే బాడీ కూడా రిలాక్స్డ్ గా ఫీలవుతుంది. కానీ వేడి నీళ్లతో స్నానం చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే శరీరం నిగారింపును కోల్పోతుంది. సో బట్టతల రాకుండా ఉండాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా వేడి నీళ్లకు దూరంగా ఉండండి. 
 


అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ తేడా లేకుండా కండీషనర్ లను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల   జుట్టు అందంగా.. బలంగా.. నిగనిగ మెరిసిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ అదొక అపోహ మాత్రమేనని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఈ కండీషనర్లను ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను కోల్పోతుంది. అందులోనూ జుట్టుకు షాంపు పెట్టిన తర్వాత కండీషనర్లను అస్సలు యూజ్ చేయకూడదని నిపుణులు వెళ్లడిస్తున్నారు. అందులోనూ మంచి కండీషనర్లనే ఎంచుకోవాలని సలహాలనిస్తున్నారు. 
 

తడి జుట్టును దువ్వడం మంచిది కాదు. చాలా మంది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా స్నానం చేసిన తర్వాత అద్దం ముందు నిలబడి జుట్టును దువ్వడం సహజంగా చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. తడిగా వెంట్రుకలు చాలా మృదువుగా ఉంటాయి. ఆ సమయంలోనే జుట్టును దువ్వితే చిక్కుల్లో ఉండే వెంట్రుకలు ఈజీగా తెగిపోయే.. లేదా పూర్తిగా ఊడిపోయే ప్రమాదం ఉంుది. అందుకే తడిగా ఉండే జుట్టును ఎప్పుడూ దువ్వకూడదు. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతే మెల్లిగా దువ్వాలి. 

click me!