మీ బాడీ ఆపిల్ ఆకారంలో ఉందా? అయితే మీకు ఈ రోగాలు రావడం ఖాయం..!

First Published Jan 23, 2023, 11:00 AM IST

ఒక్కొక్కరి శరీర ఆకారం ఒక్కోలా ఉంటుంది. ఇందులో ఆపిల్ ఆకారంలో శరీరాన్ని కలిగి ఉన్న వారికి డయాబెటీస్ తో పాటుగా గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 

ఒక్కొక్కరి శరీర ఆకారం ఒక్కోలా ఉంటుంది. పరిమాణం కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. అయితే దీనిలో కొందరి శరీర ఆకారం ఆపిల్ పండు షేప్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇలాంటి ఆకారం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి శరీరాకృతి మంచి ఆరోగ్యానికి అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే ఆపిల్ ఆకారంలో శరీరం ఉన్నవారు ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను ఫేస్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆకారం ఉన్న ఆడవారికి డయాబెటీస్ వచ్చే అవకాశం 8 రెట్లు పెరుగుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో మొత్తం 4,30,000 మందికి పైగా పాల్గొన్నారు. ఆపిల్ ఆకారం ఉన్నవారు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడే ప్రమాదం ఉందని కనుగొన్నారు. 

మధ్య భాగంలో ఎక్కువ కొవ్వు ఉండి, తొడలు, పిరుదులలో తక్కువ కొవ్వు కనిపిస్తే.. మీరు ఆపిల్ పండు ఆకారంలో ఉన్న శరీరాన్ని కలిగి ఉన్నారని అర్థం. మరి ఇలాంటి శరీరం ఉన్న వారు ఎలాంటి ప్రమాదాలకు గురవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆపిల్ ఆకారపు శరీరానికి కారణమేంటి?

ఆపిల్ ఆకారంలో ఉండే శరీరానికి కారణాలు.. ఊబకాయానికి కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, అధిక కేలరీల వినియోగం దీనికి ప్రధాన కారణాలు.
 

స్థూలకాయం ఏ రూపంలో ఉన్నా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆపిల్ ఆకారంలో ఉన్న శరీరం విషయంలో సబ్కటానియస్ ప్రాంతం కంటే విస్సెరాలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అయితే విసెరల్ కొవ్వు శరీర  జీవక్రియపై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొవ్వు దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. 

=

ఆపిల్ ఆకారపు శరీరంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలు

ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది
మంటను కలిగిస్తుంది
రక్తపోటును పెంచుతుంది
లిపిడ్ ప్రొఫైల్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.. వీటన్నింటినీ సమిష్టిగా మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుస్తారు.

స్లీప్ అప్నియా
జీర్ణశయాంతర ప్రేగు, రొమ్ము క్యాన్సర్లు 
టైప్ 2 డయాబెటిస్
హృదయ సంబంధ వ్యాధులు (కొరోనరీ ఆర్టరీ డిసీజ్)
మూత్రపిండాల వ్యాధులు

click me!