సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారితే చాలు.. అన్ని విలాసాలు కాళ్లదగ్గరకు వచ్చిపడతాయి. కాస్త ఫేమస్ అయిన ప్రతీ ఒక్కరు.. చాలా లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోతుంటారు. ఇక ఇండస్ట్రీలో స్టార్స్ గా చలామణీ అయ్యేవారి గురించి అయితే చెప్పనక్కర్లేదు కళ్లు చెదిరే లగ్జరీ లైఫ్ గడుపుతారు. సినిమా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో సకల సౌకర్యాలను అనుభవిస్తారు. కాని ఇక్కడ ఒక హీరో మాత్రం వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
సాధారణంగా రిచెస్ట్ హీరోలు భారీ భవనాలలో నివసిస్తారు. లగ్జరీ కార్లు వాడతారు. ఉదాహరణకు షారుఖ్ ఖాన్ మన్నత్ వందల కోట్లు పెట్టి కొన్నాడు.. ఇంటిముందు నేమ్ ప్లేట్ కే 25 లక్షలుపెట్టాడు షారుఖ్.. ఇక అమితాబ్ బచ్చన్ జల్సా అయితే.. ముంబయ్ లోనే కాస్ట్లీ హౌస్ అని చెప్పాలి. అయితే ఇందుకుభిన్నంగా ఉన్నాడు ఒక హీరో. వేల కోట్లు సంపాదిస్తున్న ఆయన చిన్న 1 BHK ప్లాట్ లో ఉంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్ .
బాలయ్య బాబాయ్ చేయల్సిన సినిమా.. అబ్బాయి ఎన్టీఆర్ దగ్గరకు ఎలా వచ్చి చేరింది..?
Salman khan house
దాదాపు 30 ఏళ్లుగా బాలీవుడ్ ను ఏలుతున్నాడు సల్మాన్ ఖాన్. టాప్ హీరోలలో ఎప్పుడూ ముందు వరూసలో ఉంటాడు. 60 ఏళ్ళకు దగ్గరగా ఉన్న ఈ టాప్ హీరో.. ఇంకా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తునే ఉన్నారు. అంతే కాదు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ దాదాున 2900 కోట్ల ఆస్తిని సంపాదించారట. కాని ఆయన మాత్రం చాలా సింపుల్ గా సింగల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటారట.
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?
స్టార్ హీరోలు ముందయ్ లో ..భారీ బంగ్లాలు, సీ ఫేసింగ్ విలాల్లో నివసిస్తున్నా, సల్మాన్ ఖాన్ గత నాలుగు దశాబ్దాలుగా బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని ఒక 1 BHK ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. సల్మాన్ మాత్రమే కాదు అతని కుటుంబం, తల్లిదండ్రులు, ఇద్దరు నటుడు సోదరులు, అందరూ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో వివిధ అంతస్తులలో వివిధ ఫ్లాట్స్‌లో ఉంటున్నారు.
ఈ అపార్ట్ మెంట్ కింద సల్లు బాయ్ 1 BHK ఫ్లాట్‌లో నివసిస్తాడు. పైన 3 బెడ్ రూమ్స్ ఉన్న ప్లాట్ లో తల్లీ తండ్రి ఉంటారట. ఇంత సంపాదిస్తూ.. అంత చిన్న ఇంట్లో ఉండటానికి కారణం ఏంటంటే.. తన తల్లికి దగ్గరగా ఉండాలన్న ఇష్టంతో సల్మాన్ ఖాన్ ఇంత సింపుల్ గా ఉంటున్నాడట. అంతే కాదు చాలా కాలం వరకూ ఆయన సైక్లింగ్ చేస్తూ... షూటింగ్స్ కు వెళ్ళేవాడట. ఆయనకు సైక్లింగ్ అంటే అంత ఇష్టం. సైకిల్ వెనకాల ఆయన కార్లు.. సెక్యూరిటీ వచ్చేవారట.
కాని ఇప్పుడు సల్మాన్ ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో.. టైట్ సెక్యూరిటీ మధ్య సల్మాన్ ఖాన్ ఉంటున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారు ను ఉపయోగిస్తున్నారు. 2900 కోట్లకు అధిపతి అయిన సల్మాన్ ఖాన్.. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లలా బంగ్లా లేదు. కానీ పన్వెల్‌లో 150 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది, అక్కడ ఆయన ప్రతి సంవత్సరం కొన్ని నెలలు గడుపుతాడు.