ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టి.. మాస్ ఇమేజ్ ను అమాంతం పెంచిన సినిమా సింహాద్రి. ఇది NTRను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా. ఆది తరువాత మళ్ళీ అలాంటి సినిమా ఒక్కటి పడితే.. బాగుంటుంది అనుకున్న టైమ్ లో.. అల్లరి రాముడు, నాగ లాంటి ప్లాప్ లు ఆయన్ను పలకరించాయి. ఈక్రమంలో ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలన్న కసితో NTR కథలు వింటున్నారు.