మీకు డయాబెటిస్ ఉందా? అయితే ఈ పండ్లు దూరం పెట్టాల్సిందే...

First Published Aug 26, 2021, 1:35 PM IST

రోజువారీ భోజనంలో పండ్లు, కూరగాయలు చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చు. గుండె జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు. అందుకే చాలామంది వీటిని ఆహారంలో తప్పనిసరిగా చేరుస్తుంటారు. అయితే పండ్లు డయాబెటిస్ పేషంట్లకు మంచివేనా?

diabetes

డయాబెటిక్.. రక్తంలో చక్కెర శాతం ఎక్కువవడం.. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. అయితే పండ్లు, కూరగాయల విషయానికి వచ్చేసరికి ఇది చూసీ చూడకుండా ఉంటుంటారు. పండ్లలోని చక్కెరలు పెద్దగా హాని చేయవని అనుకుంటారు. అయితే అధిక చక్కెర శాతం ఉన్నపండ్లు నిజానికి దూరం పెట్టాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. మీకు ఎంతో ఇష్టమైనా వాటిని తినడంలో కాస్త జాగ్రత్త వహిస్తారు. కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల ఈ హాని ఉండదు.

diabetes

రోజువారీ భోజనంలో పండ్లు, కూరగాయలు చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చు. గుండె జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు. అందుకే చాలామంది వీటిని ఆహారంలో తప్పనిసరిగా చేరుస్తుంటారు. అయితే పండ్లు డయాబెటిస్ పేషంట్లకు మంచివేనా?

పండ్లలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, చక్కెరలు ఉంటాయి. పండ్లలో ఉండే ఈ చక్కెరలే ఆరోగ్యానికి హాని కరంగా మారుతుంటాయి. డయాబెటిక్ రోగులు వీటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ మధుమేహ రోగగ్రస్తులకు ఇది అంతమంచిది కాదు. 

సహజమైన శక్తి నిల్వలు పండ్లు. వీటిల్లో పోషకాలు, నీరు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో ఉండే సహజ చక్కెర శరీరానికి హానికరం కాదు. చాలా మంచిది. దీనివల్ల పండ్లు తినే విషయంలో ఆందోళన అవసరం లేదు. అయితే డయాబెటిక్ పేషంట్లు పండ్లలోని చక్కెరశాతం గురించి తెలుసుకుని ఉండాలి. 

అరటిపండు.. ఆహారంలో తప్పనిసరిగా ఉండే పండు. అయితే చాలామంది మధుమేహ రోగగ్రస్తులు..పండ్ల గురించి ఎంత తెలిసినా ఆహారంలో వాటిని దూరంగా పెట్టలేకపోతుంటారు. పండ్ల తీపికి కారణం వాటిలోని చక్కెరలే. అయితే, పండ్లలోని చక్కెరతో మామూలు చక్కెరలంత హాని కలుగదు. కాకపోతే, షుగర్ వ్యాధిగ్రస్తులు, చక్కెర తక్కువగా, కేలరీలు లెక్కతో తీసుకునేవారు పండ్లలోని చక్కెర శాతం మీద అంచనా ఉంచుకోవాలి. ఎక్కువ చక్కెరలు ఏ పండ్లలో ఉంటాయి. ఏ పండ్లలో తక్కువ చక్కెరలు ఉంటాయో తెలుసుకుంటే.. మీ కేలరీల అవసరాన్ని బట్టి వాటిని తీసుకోవచ్చు. 

అరటి : అరటిపండ్లు అద్భుతమైన శక్తి కేంద్రాలు. ఒక మీడియం సైజు అరటిపండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. మీ బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలతో పాటు అరటిపండు ముక్కల్ని కూడా చేర్చచ్చు. శాండ్ విచ్ లో పీనట్ బటర్ తో పాటు అరటిపండు ముక్కల్ని కలిపి తీసుకోవచ్చు. 

మామిడి పండ్లు : పండ్లలో రారాజు మామిడి. మధురఫలమైన మామిడి అంటే అందరికీ ఇష్టమే. మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లకు దూరంగా ఉండడమే మంచిది. వీటిని వీలైనంత దూరంగా పెట్టాలి. 

ద్రాక్ష : రెండు కప్పుల ద్రాక్షలో దాదాపు 50 గ్రాముల చక్కెరలు ఉంటాయి. వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. చేయలేకపోతే రెండుగా కట్ చేసి తినడం వల్ల తక్కువ క్వాంటిటీలో తినొచ్చు. ద్రాక్షలను స్మూతీలు, షేక్స్, వోట్ మీల్స్‌లో వేసుకోవచ్చు. 

పుచ్చకాయ : ఒక మీడియం సైజు పుచ్చపండు సగం ముక్కలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. వాటర్ మెలన్ పేరుకు తగ్గట్టే పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అని పిలువబడే ప్రత్యేక ఖనిజాలను కలిగి ఉంటుంది, అది శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి అవసరం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇది తినేప్పుడు చక్కెరల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. 

పైనాపిల్ : ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో 16.3 గ్రాముల సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి మీరెంత తింటున్నారు. మీ రోజువారీ షుగర్ కంటెంట్ సరిపోయిందా చూసుకుని దీన్ని తినడం బెటర్.

మరి ఏం పండ్లు తినాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అసలు పండ్లు తినకూడదా అంటే.. బ్రహ్మాండంగా తినొచ్చు. అవోకాడో, కివి, జామకాయలు, పీచ్, పియర్స్, ప్లమ్స్, నేరేడుపండ్లు మీ రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు ఈ పండ్లలో చక్కెరల శాతం కూడా తక్కువగా ఉంటుంది. 

click me!