కొందరు.. నిలపడితే మంచిది అన్నారు కదా అని... గంటలు గంటలు కూడా నిలపడకూడదు. దాని వల్ల కూడా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... కూర్చోవడం అయినా, నిలపడటం అయినా ఏది ఎక్కువ సేపు చేయకూడదు. దేనికైనా కాస్త కంట్రోల్ ఉండాలి. మితంగా చేయాలి.
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే...ఒక రోజులో ఫిజికల్ గా యాక్టివ్ గా 4 గంటలు ఉండాలి. 8 గంటలు కనీసం నిద్రపోవాలి. నాలుగు గంటలు కూర్చోవాలి, ఐదు గంటలు నిలపడాలి. ఈ క్రమంలో ప్లాన్ చేసుకుంటే బెటర్. అలా అని అవి కూడా కంటిన్యూస్ గా చేయకపోవడమే మంచిది.