రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గించే బెస్ట్ ఇండియన్ ఫుడ్స్ ఇవే.. తప్పకుండా తినండి..

First Published Jan 8, 2023, 9:48 AM IST

మధుమేహాన్ని అదుపులో ఉంచాలంటే ఖచ్చితంగా తీపి ఆహారాలకు దూరంగా ఉండాలన్న ముచ్చట అందరికీ తెలుసు. అయితే కొన్ని రకాల ఆహారాలు మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. 

diabetes

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, శారీరక శ్రమ లేకపోవడం. నిజానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కష్టంతో కూడుకున్నది. మధుమేహులు ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఇంకొన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కానీ పెంచేవి ఏవి? తగ్గించే ఏవో? తెలిసి ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తృణధాన్యాలు

ఓట్స్, బార్లీ, క్వినోవా వంటి తృణధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇవి మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.

చియా విత్తనాలు

చియా విత్తనాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. చియా గింజలు మీ గట్ గుండా వెళ్లి చక్కెరను గ్రహించే రేటును తగ్గిస్తుంది. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్ గా ఉంటాయి. 
 

fruits

పండ్లు

అరటి వంటి ఎక్కువ తియ్యగా ఉండే పండ్లను మోతాదుకు మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కొన్ని పండ్లు మాత్రం షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, ఆపిల్ పండ్లు  టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. 
 

vegetables

కూరగాయలు

కూరగాయలలో కేలరీలు తక్కువగా.. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పొట్లకాయ, వంకాయ, గుమ్మడికాయ, టమోటాలు, ఆకుపచ్చ బీన్, క్యారెట్లు, రంగురంగుల మిరియాలు, బచ్చలికూర, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు ఉన్నాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వెల్లుల్లి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అలాగే శరీర మంటను, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే అధిక రక్తపోటు సమస్యను తగ్గించడానికి కూడా వెల్లుల్లి సహాయపడుతుంది.
 

ధనియాలు

కొత్తిమీర గింజలు రక్తంలో చక్కెరను తొలగించడానికి కారణమయ్యే ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

కాకరకాయ జ్యూస్

కాకరకాయలో బీటా కెరోటిన్ తో కూడిన లైకోపీన్ వంటి బలమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
 

ఆపిల్ సైడర్ వెనిగర్

పులియబెట్టిన ఎసిటిక్ ఆమ్లం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఉపవాస రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర ప్రతిస్పందనను 20% వరకు తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

click me!