ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నారా.. అయితే మాస్క్‌లు ధరించేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

First Published Apr 28, 2021, 4:29 PM IST

భారతదేశంలో కరోనా వైరస్ ప్రతిరోజు కేసులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. చాలామంది ప్రజలు కరోనా వ్యాధి బారిన పడుతున్నారు, అలాగే  వీరిలో కొందరు కరోనా కారణంగా మృతిచెందుతున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో మీరు మీ చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వాడకం, ముఖ్యంగా మాస్క్ ధరించటం చాలా ముఖ్యం. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులలో బయటికి వెళ్తే డబుల్ మాస్క్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కరోనా వ్యాధి బారిన పడే అవకాశాలను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కానీ డబుల్ మాస్క్ ధరించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో మీకు తెలుసా ? అవేంటో తెలుసుకుందాం.
undefined
యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ఒక అధ్యయనం నిర్వహించింది. డబుల్ మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ ప్రమాదాన్ని 95 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొంది. గత సంవత్సరం వరకు కరోనా వ్యాపించకుండ ఉండటానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అనే విషయం మీకు తెలిసిందే, కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రమాదం దృష్ట్యా డబుల్ మాస్క్ ధరించమని వైద్యులు సూచిస్తున్నారు.
undefined
మాస్క్ ధరించేటప్పుడు మాస్క్ మీ ముఖం మీద ఉన్న ముక్కు, నోరు పూర్తి కవర్ చేసేలా చూస్కుకోవాలి. అలాగే మాస్క్ సరిగ్గా ధరించకపోతే మీకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిలో కరోనా వ్యాధి లేదా కరోనా వైరస్ మీ శరీరంలోకి చాలా సులభంగా ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి మాస్క్ ధరించేటప్పుడు మాస్క్ మీ ముఖానికి సరిగ్గా కవర్ చేసేలా చూసుకోండి.
undefined
సిడిసి చేసిన అధ్యయనం ప్రకారం మీరు సరిగ్గా మాస్క్ ధరించడంతో పాటు డబుల్ మాస్క్ ధరించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. దీని కోసం మీరు వస్త్రంతో చేసిన మాస్క్ తో పాటు సర్జికల్ మాస్క్ ధరించవచ్చు, ఇది కరోనా సంక్రమణ నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మొదట మీరు సర్జికల్ మాస్క్ ధరించాలి దాని తరువాత టాప్ మాస్క్ ఏదైనా ధరించాలి.
undefined
సిడిసి చేసిన ఒక అధ్యయనం ప్రకారం మీరు సర్జికల్ మాస్క్ ని మీ ముక్కు, నోరు పూర్తిగా కవర్ చేసేలా ఉపయోగించాలని సూచించింది. మొదట మీరు సర్జికల్ మాస్క్ ధరించి ఆపై మరొక మాస్క్ ధరించాలి. ముక్కు, నోరు రెండు వైపుల పూర్తిగా కవర్ చేసేల ధరించాలి. అలాగే డబుల్ మాస్క్ ధరించేటప్పుడు మీరు కొన్ని తప్పులు చేయకుండా గుర్తుంచుకోవాలి. డబుల్ మాస్క్‌లు ధరించేటప్పుడు రెండూ సర్జికల్ మస్కూలు ధరించకూడదని మీరు గమనించాలి. అలాగే డబుల్ మాస్క్ ధరించేటప్పుడు N95 మాస్క్‌తో సర్జికల్ మాస్క్ ధరించకూడదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని, ఇతరులను కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
undefined
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona
undefined
click me!