సెక్స్ మీద మీకు మోజు తగ్గిందా: కారణాలివీ....

First Published Sep 27, 2020, 4:09 PM IST

పూర్తిస్థాయి శృంగారాస్వాదన చేయాలంటే ఆసక్తి, ఉత్సుకత అవసరం. సెక్స్ డ్రైవ్ లేకపోవడం వల్ల అనాసక్తి పెరుగుతుంది. శృంగారం పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది. అందుకు గల కారణాలను చూద్దాం. 

రతిక్రీడలో సంతృప్తి చెందాలంటే, శృంగారంలో భావప్రాప్తి జరగాలంటే ఆసక్తి అత్యంత ముఖ్యమైంది. అదే సమయంలో అందుకు తగిన సంసిద్ధత కూడా అవసరం. అవే ఇరువురి మధ్య రతిక్రీడను రసప్లావితం చేసుతుంది. నిరాసక్తత, ఉత్సాహం లేకపోతే సెక్స్ ను తనవితీరా ఆస్వాదించడం సాధ్యం కాదు.
undefined
మొక్కుబడి వ్యవహారంగా మారిపోతుంది. మనం చేసే పనుల్లో అదో పనిగా మాత్రమే అవుతుంది తప్ప ఉత్సాహాన్ని నింపదు. పూర్తిస్థాయి శృంగారాస్వాదన చేయాలంటే ఆసక్తి, ఉత్సుకత అవసరం. సెక్స్ డ్రైవ్ లేకపోవడం వల్ల అనాసక్తి పెరుగుతుంది. శృంగారం పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది. అందుకు గల కారణాలను చూద్దాం.
undefined
ఒత్తిడి, మానసిక స్థితిలో అస్థిరత శృంగారం పట్ల అనాసక్తి ఏర్పడడానికి ఓ కారణం. ఆ రెండు కారణాలు సెక్స్ పట్ల తీవ్రమైన వైముఖ్యానికి కారణమవుతాయి. అంతేకాదు, లైంగిక ఆనందాన్ని అవి దూరం చేస్తాయి. ఒత్తిడికి ఎన్నైనా కారణాలు కావచ్చు. కానీ ఆ ఒత్తిడిని అధిగమించడానికి రతిక్రీడ పనికి వస్తుంది.
undefined
తీవ్రమైన అలసట రతిక్రీడ పట్ల అనాసక్తిని కలిగిస్తుంది. లైంగిక కార్యకలాపం పట్ల ఆసక్తిని చూపకుండా చేస్తుంది. లైంగిక క్రీడలో పాల్గొనాలని అనుకున్నప్పటికీ మనసు, శరీరం తీవ్రంగా అలసిపోతే అది సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సందర్బాల్లో ఉత్సాహం పొంది, ఆసక్తిని పెంచుకోవాలి. లేదంటే అది మీ భాగస్వామి పట్ల ఓ బాధ్యత మాత్రమే అవుతుంది.
undefined
ఇరువురి మధ్య సయోధ్య లేకపోతే, సంబంధాల్లో విభేదాలు చోటు చేసుకుంటే కూడా లైంగిక జీవితం ప్రభావితం అవుతుంది. మీ మధ్య సంబంధం శృంగార జీవితంపై ఎనలేని ప్రభావం చూపుతుందని దాని అర్థం. ప్రతి చిన్న విషయానికి గొడవ పెడితే, ఒకరి తప్పులను ఒకరి ఎత్తి చూపుతుంటే లైంగిక క్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. తీవ్ర వైముఖ్యం కూడా ఏర్పడుతుంది.
undefined
హార్మోన్ల అసమతుల్యత కూడా శృంగార జీవితంపై ప్రభావం చూపుతుంది. లైంగిక క్రీడ పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఈస్ట్రోజెన్, ప్రోగోస్టెరోన్, టెస్టోస్టెరోన్ హార్నోన్ల అసమతుల్యత సెక్సువల్ డ్రైవ్ ను, శక్తిని తగ్గిస్తుంది. అది శృంగార జీవితంలో నాణ్యతను తగ్గిస్తుంది.
undefined
మీ భాగస్వామి మర్మాంగాలు మీ మర్మాంగాలకు నొప్పి కలిగిస్తే లైంగిక క్రీడపై ప్రభావం చూపుతుంది. అది విధమైన నొప్పి కలిగించే అనుభవం పాతదైనా, కొత్తదైనా లైంగిక క్రీడపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శృంగారం అమేయమైన ఆనందాన్ని ప్రసాదించాలి. దాన్ని మనసారా అస్వాదించాలి.
undefined
మానసికపరమైన కారణం కూడా లైంగిక క్రీడపై ఆసక్తి తగ్గడానికి కారణమవుతుంది. ఒకరు దూకుడు ప్రదర్శిస్తుంటే, మరొకరు ఆ మేరకు జీవిత భాగస్వామిని సంతోషపెట్టలేననే సందేహం కూడా శృంగారాన్ని పూర్తి స్థాయిలో అస్వాదించడానికి అవకాశం ఇవ్వదు. అందువల్ల ఇరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.
undefined
click me!