Devi Sri Prasad, Pushpa 2 , allu arjun, sukumar
'పుష్ప ది రూల్' సంగీతం విషయంలో గొడవలు జరిగాయనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, చిత్ర దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మధ్య మంచి ప్రెండ్షిప్ ఉంది. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్.
ఈ టైమ్ లో దేవి శ్రీని తప్పించి మరొక సంగీత దర్శకుడిని నేపథ్య సంగీతం అందించడం కోసం ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. నిర్మాత ఒత్తిడి వల్లే మరొక 'పుష్ప 2 ది రూల్' చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందించడానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఓపెన్ అయ్యారు, దేవి ఏం అన్నారు? అనే వివరాల్లోకి వెళితే...
Devi Sri Prasad
అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). రష్మిక (Rashmika) హీరోయిన్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో వేడుక (Pushpa 2 The Rule Wildfire Event) నిర్వహించింది. అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల (Sree Leela), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తన అసహనాన్ని దేవి నవ్వుతూనే బయిటపెట్టేసారు. ఎవరు ఏమనుకున్నా సరే..తగ్గేదేలే అన్న రీతిలో స్టేజిపై నిర్మాతలకు కౌంటర్ వేసారు.
Devi Sri Prasad
పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిని పక్కన పెట్టి తమన్, అజనీష్ లోక్ నాథ్ శ్యామ్ లను రంగంలోకి దింపింది మైత్రీ బ్యానర్. దేవిశ్రీ ప్రసాద్ సమయానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని, అందువల్ల మరో ముగ్గుర్ని తీసుకోవాల్సివచ్చిందని చిత్ర టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది
అయితే తాను సింగిల్ గా చేయాల్సిన పని మరొకరికి అప్పగించడం దేవికి నచ్చలేదు,నచ్చదు అనేది నిజం. సుకుమార్ కూడా నిర్మాతల్ని కాదనలేక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని భాగాలుగా షేర్ చేసి, మరో ముగ్గురికి అప్పగించారు.
అయితే దేవిశ్రీ తన వంతుగా సినిమాకు ఆర్.ఆర్ ఇచ్చుకొంటూ వెళ్లాడని, దేవిశ్రీ ఇచ్చిన వెర్షనే ఫైనల్ కాపీలో వినే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే… దేవిశ్రీకి మైత్రీ మూవీస్ పై ఉన్న అసహనం మాత్రం తగ్గలేదు. అది చెన్నైలో జరిగిన ఈవెంట్ లో కనిపించింది.''మనకు ఏం కావాలన్నా అది అడిగి తీసుకోవాఐ. నిర్మాత దగ్గర పేమెంట్ అయినా సరే స్క్రీన్ మీద పేరు అయినా సరే'' అంటూ స్పీచ్ అదరకొట్టేసారు.
దేవిశ్రీ (Devi Sri Prasad) మాట్లాడుతూ.. ‘‘పుష్ప’ మా అందరికీ ప్రత్యేకం. మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ? (అల్లు అర్జున్). ఫైనల్ మిక్సింగ్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉండడంతో ఇక్కడికి రాలేకపోయారు.
ఈ సినిమా కథ, బన్నీ నటన మరో స్థాయిలో ఉంటాయి. నేను ఫస్టాఫ్‌కే ఫిదా అయిపోయా. ఈ చిత్రం కోసం సుకుమార్, బన్నీ ఎంతో కష్టపడ్డారు. త్వరలోనే మరో పాట విడుదల కానుంది. అందులో బన్నీ ఊర మాస్ స్టెప్పులు చూస్తారు. చాలా మంది హీరోయిన్లు డ్యాన్స్ చేసిన తొలి స్పెషల్ సాంగ్‌కు నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.
ఈ క్రెడిట్ ఏ సంగీత దర్శకుడికీ లేదు. రవిశంకర్ (నిర్మాత) సర్.. నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే.. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ, ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి.
నా విషయంలో మీకు కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడూ రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్ టైమ్ సర్’’ అని అన్నారు.