మితిమీరిన ఆవలింతలు ఇంత డేంజరా? ఇలా అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి..

First Published Jan 19, 2023, 4:56 PM IST

ఒక్కోసారి రోజుల తరబడి ఆవలింతలు మరీ ఎక్కువగా వస్తుంటారు. ఇలా రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మితిమీరిన ఆవలింతలు వస్తున్నట్టైతే మీ శరీరం మీకు ఏదో చెప్పేందుకు  ప్రయత్నిస్తుందనడానికి సంకేతంగా పరిగణించాలంటున్నారు నిపుణులు. 
 

ఆవలింత అనేది ఒక సహజ ప్రక్రియ. నోరు తెరిచి, లోతుగా శ్వాస తీసుకోవడం, ఊపిరితిత్తులను గాలితో నింపడం వంటి అసంకల్పిత ప్రక్రియను ఆవలింత అంటారు. ఆవలింతకు ఖచ్చితమైన కారణమేదీ లేదు. కానీ ఇది తరచుగా వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే. నిజానికి ఆవలింత సాధారణంగా నిద్రలేకుంటేనో లేదా బాగా అలసిపోతేనో వస్తుంది. బాగా నీరసంగా అయినప్పుడు, పనిలో బాగా అలసిపోయినప్పుడు, విసుగు వంటి సందర్భాల్లో ఆవలింతలు పక్కాగా వస్తాయి. ఎవ్వరికైనా రోజంతా ఆవలింతలు రావు. కానీ కొంతమందికి వస్తుంటాయి. దీనికి అలసట కారణం కాకపోవచ్చు. అప్పుడప్పుడు ఆవలింతలు రావడం సహజమే. కానీ తరచుగా ఆవలింతలు రావడం మామూలు విషయం కాదు. దీనికి ఏదో బలమైన కారణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

కొన్ని ఆవలింతలు కొన్ని సెకన్ల పాటు ఉంటాయి. కొంతమంది ఆవలిస్తే కళ్ల నుంచి నీరు కారుతుంది. ఈ ఆవలింతలు పెద్దగా ఉంటాయి. నిజానికి కొన్ని అనారోగ్య సమస్యల వల్లే తరచుగా ఆవలిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

తరచుగా ఆవలించడానికి సాధారణ కారణాలు: తరచుగా ఆవలించడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వస్తుంది. అవేంటంటే.. 

మగత, విసుగు లేదా అలసట

నిద్ర లేమి

ఒత్తిడి, ఉద్రిక్తత

స్లీప్ అప్నియా లేదా నార్కోలెప్సీ వంటి నిద్ర రుగ్మతలు 

కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు 

నిర్జలీకరణం

శరీర నొప్పులు

ఇతర శ్వాసకోశ సమస్యలు 

మితిమీరిన ఆవలింతకు చికిత్స

ఒకవేళ మీకు మందుల వల్ల ఆవలింతలు ఎక్కువగా వస్తున్నట్టైతే వాటిని తక్కువ మోతాదులో తీసుకోండి. 
 

ఇతర ముఖ్యమైన కారకాలు

క్రమం తప్పకుండా 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. ముఖ్యంగా వారాంతరాల్లో మీరు ఎక్కువ సేపు నిద్రపోవడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ నిద్ర చక్రాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.

రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పును తప్పిస్తుంది. 

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి మీ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. 

కెఫిన్, ఆల్కహాల్ ను తాగడం మానుకోండి. ముఖ్యంగా రాత్రి పూట మందును అతిగా తాగకండి. 

సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టుకుని నిద్రపోకూడదు. 

తరచుగా ఆవలింత రావడం మూర్ఛ లేదా కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల లక్షణం కూడా కావొచ్చు. అందుకే ఆవలింతలు మరీ ఎక్కువగా వస్తే వెంటనే  చెకప్ లు చేయించుకోండి. అధిక ఆవలింత చిరాకు కలిగిస్తుంది. అయినప్పటికీ ఈ ఆవలింత ద్వారా మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నించడానికి సంకేతంగా సంకేతంగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
 

click me!