తిన్న తరువాత వాకింగ్ మంచిదేనా? ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

First Published Nov 5, 2021, 3:12 PM IST

తినగానే కాసేపు నడవడం అలవాటుగా మారిపోతుంది చాలామందికి. అయితే ఇది నిజమేనా? జీర్ణక్రియ వేగవంతం కావడానికి, మెరుగైన జీవక్రియకు ఇది సహాయపడుతుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? 

భోజనం చేసిన తర్వాత కాసేపు అలా వాకింగ్ చేయడం మనలో చాలా మందికి అలవాటు. ఇలా తిని అలా కూర్చుండి పోవడమో.. మంచం ఎక్కేయడమో కాకుండా.. కాసేలు అలా అలా నాలుగడుగులు వేయడం వల్ల... తిన్నది త్వరగా జీర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. 

అందుకే తినగానే కాసేపు నడవడం అలవాటుగా మారిపోతుంది చాలామందికి. అయితే ఇది నిజమేనా? జీర్ణక్రియ వేగవంతం కావడానికి, మెరుగైన జీవక్రియకు ఇది సహాయపడుతుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? 

ఇది ప్రయోజనకరమేనా?
భోజనం చేయడం పూర్తి కాగానే... మీ శరీరం దాన్ని జీర్ణం చేసే పని మొదలుపెడుతుంది. ముందుగా ఆహారాన్ని విచ్చిన్నం చేస్తుంది. పోషకాలను గ్రహిస్తుంది. అయితే జీర్ణక్రియలోని ఎక్కువ భాగం చిన్న ప్రేగులలో జరుగుతుంది. భోజనం తర్వాత నడవడం వల్ల కడుపులో నుండి, చిన్న ప్రేగులలోకి ఆహారం వేగంగా చేరుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

ఇది ఎలా సహాయపడుతుంది? అంటే.. "ఆహారం మీ కడుపు నుండి చిన్న ప్రేగులలోకి ఎంత వేగంగా వెళుతుందో, ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సాధారణ సమస్యల ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. సాధారణ వ్యాయామంతో పాటు భోజనం తర్వాత 30 నిమిషాల నడక వల్ల ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం అవకాశాలను తగ్గిస్తుంది.

post prandial walks జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా టైప్-2 మధుమేహం ఉన్న వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. న్యూజిలాండ్ లోని ఒటాగో విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం టైప్-2 మధుమేహం ఉన్నవారికి, భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మంచిదని సూచిస్తుంది, ముఖ్యంగా ఎక్కువ కార్బ్స్ ఉన్న భోజనం తర్వాత తప్పనిసరి నడవాల్సిందే.

దీనివల్ల ఏం జరుగుతుంది?
శరీరం ఆహారాన్ని గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తికి ప్రధాన వనరు. భోజనం చేసిన తర్వాత, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ స్పైక్‌ను ఎదుర్కోవటానికి, శరీరం ఇన్సులిన్‌ను స్రవిస్తుంది, ఇది కణాలలోకి గ్లూకోజ్‌ను ప్రభావితం చేయడానికి సహాయపడుతుంది. 

అయినప్పటికీ, డయాబెటిక్ వ్యక్తుల్లో, ఇన్సులిన్ చర్య బలహీనపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే ప్రక్రియను నిరోధిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయికి దారి తీస్తుంది, ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. భోజనం తర్వాత నడక వల్ల గ్లూకోజ్ చర్య కోసం శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరం ద్వారా కొంత గ్లూకోజ్ ఉపయోగించబడుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

walking disorder

సరే.. నడవడం ఓకే.. అయితే మరో ప్రశ్న ఏంటంటే.. తిన్న తరువాత ఎంత సేపటికి నడవడం మొదలు పెట్టాలి? అంటే.. భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, పొట్టలో ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే నడకలోని ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే.. లంచ్ లేదా డిన్నర్ తర్వాత 30-45 నిమిషాల విరామం తర్వాత నడవడం మంచిది అని నిపుణులు చెబుుతున్నారు. 

లేకపోతే... పెరిగిన ఇంటెన్సిటీ వర్కవుట్‌ల వల్ల ఎక్కువ రక్తాన్ని పని చేసే కండరాల వైపు, జీర్ణాశయం నుండి దూరంగా లాగవచ్చు. ఇది మీ జీర్ణక్రియ మందగించడానికి, అజీర్ణానికి కూడా దారితీయవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, భోజనానంతర నడక వల్ల రోజుకు 10,000 అడుగులు నడవాలనే ఫిట్‌నెస్ లక్ష్యాన్ని కూడా ఈజీగా చేరుకోవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ అయినా కూడా ఎండార్ఫిన్లు లేదా మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది, తద్వారా శరీరానికి విశ్రాంతినిస్తుంది. భోజనం తర్వాత నడక ఆ దిశలో ఒక సానుకూల అడుగు.

భోజనం తరువాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిశాయి కాబట్టి.. దీనికి అనుకూలంగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. 

కార్తీక మాసం: పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, నైవేద్యం..!

click me!