’ఆ రెండు పార్టీలు ఒక్కటే.. వారికి తమ కుటుంబ ప్రయోజనాలే ఫస్ట్’.. వేములవాడ సభలో ప్రధాని మోడీ..

By Rajesh KarampooriFirst Published May 8, 2024, 11:55 AM IST
Highlights

PM Modi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని మోడీ తరువాత  కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహిస్తు్న్న బహిరంగ సభలో మాట్లాడారు.

PM Modi: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(నేడు) తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ బీజేపీ అభ్యర్థులకు మద్దుతుగా వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రధాని రాజ్ భవన్ లో బస చేశారు. బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక  హెలికాప్టర్ లో ప్రధాని మోడీ వేములవాడకు బయలుదేరారు.

వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రధానిమోడీని శాలువాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల ప్రత్యేక ఆశీర్వాదాలు  తీసుకున్నారని ప్రధాని మోడీ. మోదీ రాకతో ఆలయంవద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అనంతరం కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అడ్రస్‌ కూడా కనిపించడం లేదన్నారు. పదేళ్ల బీజేపీ పాలన ఎలా ఉందో మీరంతా గమనించారన్నారనీ,తమ పాలనలో భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు.

అలాగే.. దేశ రక్షణ రంగంలో కీలక మార్పులు వచ్చాయనీ, దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి భారత్ చేరుకుందని పేర్కొన్నారు.  బీజేపీ పాలనలో  దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని అన్నారు. బీజేపీ దేశానికి ప్రాధ్యానత ఇస్తుంటే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మాత్రం తమ ఫ్యామిలీలకు తొలి ప్రాధ్యాతన ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే ఉన్నారనీ, ఆ పార్టీల మధ్య  తేడా ఏమీ లేదనీ,  ఆ పార్టీలను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలన్నారని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని తెలిపారు ప్రధాని మోడీ.

click me!