Asianet News TeluguAsianet News Telugu

కార్తీక మాసం: పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, నైవేద్యం..!

కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో ఏ  రోజు ఎలాంటి పద్దతులు పాటించాలో తెలియజేయడం జరిగినది. 

The Significance of Karthika masam and Karthika deepalu
Author
Hyderabad, First Published Nov 5, 2021, 1:11 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


తేదీ 5 నవంబర్ 2021 శుక్రవారం నుండి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో ఏ  రోజు ఎలాంటి పద్దతులు పాటించాలో తెలియజేయడం జరిగినది. 

* 1వ రోజు :- నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు

దానములు:- నెయ్యి, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వథా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా


* 2వ రోజు :- నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము:- బ్రహ్మ

జపించాల్సిన మంత్రము:- ఓం గీష్పతయే - విరించియే స్వాహా


* 3వ రోజు:- నిషిద్ధములు :-  ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు:- ఉప్పు

పూజించాల్సిన దైవము:- పార్వతి

జపించాల్సిన మంత్రము:-  ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా


* 4వ రోజు:- నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి

దానములు:- నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా


5వ రోజు:- నిషిద్ధములు:- పులుపుతో కూడినవి

దానములు:- స్వయంపాకం, విసనకర్ర

జించాల్సిన దైవము:- ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము:-  (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)


* 6వ రోజు:- నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి

దానములు:- చిమ్మిలి

పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా


* 7వ రోజు:- నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా


* 8  వ రోజు:-

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు:- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దుర్గ

జపించాల్సిన మంత్రము:- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా


* 9వ రోజు:-

నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము:- అష్టవసువులు - పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః


10వ రోజు:- నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము:- ఓం మహామదేభాయ స్వాహా


* 11 వ రోజు:- నిషిద్ధములు:- పులుపు, ఉసిరి

దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము:- శివుడు

జపించాల్సిన మంత్రము:-  ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ


* 12వ రోజు:- నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా


* 13వ రోజు:- నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి

దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము:- మన్మధుడు

జపించాల్సిన మంత్రము:-  ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా


* 14వ రోజు:- నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము:- యముడు

జపించాల్సిన మంత్రము:- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా


* 15వ రోజు:-

నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు 

జపించవలసిన మంత్రం:- 'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'


* 16వ రోజు:- నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల

దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః


* 17వ రోజు:-

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా


*18వ రోజు:- నిషిద్ధములు:- ఉసిరి

దానములు:- పులిహార, అట్లు, బెల్లం

పూజించాల్సిన దైవము:- గౌరి

జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా


* 19వ రోజు:-

నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు:- నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము:- వినాయకుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా


* 20వ రోజు:- నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి

దానములు:- గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం


* 21వ రోజు:- నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు:- యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము:- కుమారస్వామి

జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా


* 22వ రోజు:- నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన :-మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా


* 23వ రోజు:-

నిషిద్ధములు:- ఉసిరి, తులసి

దానములు:- మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము:-  ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా


* 24వ రోజు:- నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ

జపించాల్సిన మంత్రము:- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా


* 25వ రోజు:- నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు:- యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము:-  ఓం ఈశావాస్యాయ స్వాహా


26వ రోజు:- నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు

దానములు:- నిలవవుండే సరుకులు

పూజించాల్సిన దైవము:- కుబేరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా


* 27వ రోజు:-

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా


* 28వ రోజు:-

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు:- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- ధర్ముడు

జపించాల్సిన మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా


* 29వ రోజు:- నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్


* 30వ రోజు:- నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

Follow Us:
Download App:
  • android
  • ios