Deepika Padukone
రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనె బాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్నారు. 2018లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా దీపిక పదుకొనె తల్లి కాలేదు. ఇద్దరూ సినిమాలతో బిజీగా గడిపారు. ఈ క్రమంలో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.
రణ్వీర్-దీపిక పేరుకే భార్య భర్తలు. వారి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం లేదనే వాదన ఉంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ 2024 ఫిబ్రవరి నెలలో దీపిక పదుకొనె ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలలో పండంటి బిడ్డకు జన్మిస్తున్నట్లు వెల్లడించింది. దీపిక పదుకొనె ప్రకటన అభిమానుల్లో సంతోషం నింపింది.
సడన్ గా రణ్వీర్ సింగ్ షాక్ ఇచ్చాడు. ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. 2023కి ముందు ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్స్ మొత్తం క్లియర్ చేశాడు. వాటితో పాటు పెళ్లి ఫోటోలు కూడా రీసైకిల్ బిన్ లోకి వెళ్లిపోయాయి. ఈ పరిణామం ఒక్కసారిగా సంచలనం రేపింది .
సాధారణంగా సెలెబ్స్ తన జీవిత భాగస్వాములు లేదా లవర్స్ తో విడిపోతే ఇదే చేస్తారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో పేర్లు మార్చడం. కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడం చేస్తారు. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమైన సమంత సోషల్ మీడియా వేదికగా ఇదే తరహా హింట్ ఇచ్చింది.
రణ్వీర్ సింగ్ పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి డిలీట్ చేయడం ద్వారా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడనే వాదన మొదలైంది. కొందరు ఈ విడాకుల ఊహాగానాలను కొట్టి పారేస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. లేదా మరొక కారణం ఉండొచ్చు. ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన విడాకులు తీసుకుంటున్నారని చెప్పలేం అంటున్నారు.
అందులోనూ దీపిక పదుకొనె తల్లిగా ఉన్నారు. తండ్రి కాబోతున్న రణ్వీర్ విడాకులు తీసుకునే సాహసం చేస్తాడా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్పష్టత రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. లేదంటే కొంత కాలం వేచి చూడాలి.
కాగా దీపిక పదుకొనె కెరీర్లో మొదటిసారి తెలుగు సినిమా చేస్తుంది. ప్రభాస్ కి జంటగా కల్కి 2829 AD లో నటిస్తుంది. దిశా పటాని మరొక హీరోయిన్. అమితాబ్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్న కల్కి చిత్రం జూన్ 27న విడుదల కానుంది.