బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో షోలని రవి తన ట్యాలెంట్ తో చాలా హుషారుగా నడిపించాడు. లాస్య, శ్రీముఖి లాంటి వాళ్లకి కో యాంకర్ గా చేశాడు. యాంకర్ రవి తన జీవితంలో ఎంత గుర్తింపు పొందాడో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అతడు టివి షో చేసినా, బిగ్ బాస్ లో పాల్గొన్నా ఎక్కువగా వివాదాలతోనే హైలైట్ అయ్యాడు.