మోగ్లీ గురించి అందరికీ తెలుసు. పుస్తకాల్లోనో, సినిమాల్లోనో మోగ్లీ గురించి అందరూ తెలుసుకునే ఉంటారు. చిన్నప్పుడు అడవిలో మిస్సయిన ఓ బాలుడు.. జంతువుల మధ్యనే పెరుగుతాడు. అయితే... అవంతా సినిమాల్లోనే జరుగుతాయి.. నిజంగా అలా ఎవరైనా జంతువుల మధ్య పెరగుతారా అనే అనుమానం అందరికీ కలుగుతుంది. అయితే.. నిజంగా కూడా అలా పెరిగిన వాళ్లు ఉన్నారు.
undefined
'ఇండియన్ వోల్ఫ్ బాయ్' గా ప్రసిద్ది చెందిన సానిచెర్ 19 వ శతాబ్దంలో నివసించారు. అతను తోడేళ్ళ మధ్యనే పెరిగాడు. ది జంగిల్ బుక్ నిజానికి సానిచార్ అనే బాలుడి కథ ఆధారంగా తెరకెక్కించారనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంది.
undefined
మన రియల్ లైఫ్ మోగ్లీ కథ హీరో సానిచర్. ఈ బాలుడిని 1872 లో ఉత్తర ప్రదేశ్‌లోని వేటగాళ్ల బృందం కనుగొంది. వారు అతనిని చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆ బాలుడు అందరిలా లేడు. అతను నాలుగు కాళ్ళ తో నడుస్తూ కనిపించాడు. తోడేళ్లతోపాటు ఆ బాలుడు కూడా కలిసి ఉండటం చూసి షాకయ్యారు.
undefined
అయితే.. ఈ వేటగాళ్లని చూసి తోడేళ్లతోపాటు ఆ బాలుడు కూడా భయపడిపోయి ఓ గుహలో దాక్కున్నాడు. అయితే.. ఆ వేటగాళ్లు తోడేళ్లను చంపేసి బాలుడిని కాపాడాలని అనుకున్నారట.
undefined
ఆ సమయంలో బాలుడి వయసు ఆరు సంవత్సరం ఉన్నట్లు అప్పటి అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఆ బాలుడిని తీసుకువచ్చి.. ఓ అనాథ శరణాలయంలో చేర్పించారు. అయితే.. అక్కడ బాలుడికి సానిచర్ అనే నామకరణం చేశారు. ఇదొక ఉర్ధూ పదం. బాలుడిని శనివారం ఆ శరణాలయానికి తీసుకువెళ్లడంతో.. ఊర్దూలో శనివారాన్ని సానిచర్ అంటూ పేరుపెట్టారు.
undefined
అడవిలో పెరిగిన అతనిని.. మనుషులలోకి తీసుకువస్తే.. మామూలు మనిషి అవుతాడని అందరూ భావించారు. కానీ.. వాళ్లు అనుకున్నంత సులభంగా ఏదీ జరగలేదు.అతని ఐక్యూ లెవల్ చాలా తక్కువగా ఉంది. అతని మానసిక ఆరోగ్యం కూడా అస్సలు బాలేదు. మనుషుల్లో కలవలేకపోయాడు. కనీసం ఒక్క పదం కూడా నేర్చుకోలేకపోయాడు.
undefined
అతనికి మాటలు నేర్పించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అతను ఒక్క పదం కూడా నేర్చుకోలేకపోయాడు.
undefined
చాలా కాలం అతను నాలుగు కాళ్ల జంతువులాగానే నడవడం గమనార్హం. అతని గొంతు కూడా జంతువుల అరుపుల మాదిరిగానే ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత అతను రెండు కాళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు. కానీ అతనికి దుస్తులు వేయడం నేర్పించడం అక్కడివారికి చాలా కష్టమైంది. మాములు మనుషుల్లగా దుస్తులు వేసుకోవడానికి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. నగ్నంగా తిరగడానికే ఇష్టపడేవాడు.
undefined
అతను అనాథ ఆశ్రమానికి వచ్చిన కొత్తలో.. ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. తన పంటితో కొరికి మరీ ఎముకలను ఇష్టంగా తినేవాడు. కాగా.. అదే ఆశ్రమంలో.. అచ్చం సానిచర్ లాంటి మరో పిల్లాడు కూడా ఉన్నాడు. వారిద్దరి మధ్య త్వరగా స్నేహం కుదిరిందని అధికారులు చెప్పారు. వారిద్దరూ ఒకరికి మరొకరు సహాయం చేసుకునేవారట. వారిద్దరిలో ఒకరు మరొకరికి కప్పులో టీ తాగడం నేర్పించడం గమనార్హం.
undefined
అనాథాశ్రమంలో 10 సంవత్సరాల తరువాత కూడా సానిచెర్ మాములు మనిషి కాలేకపోయాడు. అచ్చం జంతువులాగే ప్రవర్తించేవాడు. అతను అక్కడ గ్రహాంతరవాసిలా నివసించాడు. అడవిలో ఉన్న తన కుటుంబం నుండి బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ పడేసినట్లు అతను భావించేవాడు. ఆ బాధ అతనిని నిత్యం వెంటాడుతూ ఉండేది. అందుకే మాములు మనిషి కాలేకపోయాడు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి అడవికి వెళ్లిపోతాను కదా అని భావించేవాడు.
undefined
అయితే.. అతను మామూలు మనుషుల నుంచి కేవలం రెండు విషయాలను మాత్రం నేర్చుకోగలిగాడట. ఒకటి పరిశుభ్రత కాగా... మరోకటి పొగ తాగడం. ధూమపానానికి బాగా అలవాటు పడ్డాడట. చైన్ స్మోకర్ లాగా నిత్యం వాటిని కాలుస్తూ ఉండేవాడట. దాని కారణంగానే అతను అనారోగ్యానికి గురయ్యాడు. కేవలం 29 సంవత్సరాలకే అంటే 1895లో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు.
undefined