Lifestyle

టమాటా, ఉల్లితో పోటీపడుతున్న చిక్కుడు... ధర ఎంతో తెలుసా?

Image credits: freepik

హైదరాబాదీలను భయపెడుతున్న కూరగాయలు

కూరగాయల ధరలు కొంటే కాదు వింటేనే సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా వుంది. పల్లెల్లో కాస్త నయం... హైదరాబాద్ లో ధరలు కొండెక్కాయి. 
 

Image credits: freepik

తగ్గిన టమాటా, ఉల్లి ధరలు

కొద్దిరోజుల క్రితం ఉల్లిపాయలు, టమాటా ధరలు మండిపోయాయి. ఓ సమయంలో కిలో 100 రూపాయలు పలికాయి. ఇప్పుడు వాటి ధరలు తగ్గాయి. 
 

Image credits: Getty

కొండెక్కిన చిక్కుడు

అయితే ఇప్పుడు చిక్కుడు వంతు వచ్చింది. టమాటా, ఉల్లి ధరలతో పోటీపడుతూ చిక్కుడు ధర పెరుగుతోంది. 
 

Image credits: fromindia.com

హైదరాబాద్ లో చిక్కుడు ధరెంత?

ప్రస్తుతం హైదరాబాద్ లో చిక్కుడు హోల్ సేల్ మార్కెట్ ధర 40‌-60 రూపాయల వరకు వుంది. ఇది మార్కెట్ లోకి వచ్చేసరికి కిలో రూ.70-80 పలుకుతోంది. 

Image credits: Getty

చిక్కుడు సెంచరీ కొడుతుందా?

ఈ చిక్కుడు ధర పెంపు చూస్తుంటే త్వరలోనే సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికే సామాన్యులకు కాస్త దూరమైన చిక్కుడు మరింత దూరం కానుందన్నమాట. 

Image credits: Pexels

మునగకాయ రూ.100 దాటేసింది

ఇక చిక్కుడు లాగే మునగకాయ ధర కూడా చాలా ఎక్కువగా వుంది. కిలో మునగకాయ 120-170 రూపాయల వరకు వుంది. 
 

Image credits: Getty

పచ్చిమిర్చీ ఘాటెక్కింది...

పచ్చిమిర్చి ధర కూడా చాలా ఎక్కువగా వుంది.  మార్కెట్ లో కిలో మిర్చి ధర 50-60 రూపాయలుగా వుంది. 

  

Image credits: social media

ప్రధాన కూరగాయల ధరలు?

బంగాళాదుంప రూ.40, క్యాప్సికమ్ రూ.45, కాకరకాయ రూ.40, క్యారెట్ రూ.50,వంకాయలు రూ.35-40, బెండకాయలు రూ.40 ధర పలుకుతోంది. 

Image credits: Getty

మరి ఆకుకూరల ధరలు?

ప్రధాన కూరగాయల ధరలే కాదు ఆకుకూరల ధరలు కూడా అలాగే వున్నాయి. పాలకూర నుండి కరివేపాకు వరకు ప్రతి ఒక్కటి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. 

Image credits: Getty

హైదరాబాద్ లో ఇదీ పరిస్థితి...

హైదరాబాద్ లో కూరగాయాల ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. బయట మార్కెట్ లోనే ఇలా ధరలు మండిపోతుంటే షాపింగ్ మాల్స్, షాప్స్ లో ఈ ధరలు మరింత ఎక్కువగా వున్నాయి. 

Image credits: our own

ఇవి తింటేనే మలబద్దకం సమస్య వస్తుంది

పుష్ప హీరోయిన్ కట్టుకున్న చీరలు ఎంత తక్కువ ధరో తెలుసా

చలికాలంలో తినకూడని పండ్లు ఇవే

చపాతీ హెల్దీగా మార్చడానికి పిండిలో ఏం కలపాలి?