ఈ డస్ట్‌బిన్‌ మాట్లాడుతుంది, ఏడుస్తుంది కూడా.. వైరల్‌ వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే

By Narender Vaitla  |  First Published Dec 14, 2024, 12:00 PM IST

టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. సాంకేతిక విప్లవం మనిషి శారీరక శ్రమను పూర్తిగా తగ్గించింది. చివరికి చెత్త బుట్టలు కూడా సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఈ జాబితాలోకే వస్తుంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 
 


Viral Video: టెక్నాలజీ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారిన కాలంతో పాటు సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనిషి శ్రమను తగ్గిస్తూ, మెరుగైన సేవలు లభిస్తున్నాయి. కాదేది టెక్నాలజీకి అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ అనగానే మనకు మొదట గుర్తొచ్చే దేశాల్లో హాంగ్‌కాంగ్‌ ఒకటి. పేరుకు చిన్న దేశమే అయినా చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ దేశం. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇక్కడ తయారైన ప్రాసెసర్స్‌, చిప్స్‌ ఎగుమతి అవుతుంటాయి. టెక్నాలజీకి పెట్టింది పేరైన హాంగ్‌కాంగ్‌లో రూపొందించిన ఓ డస్ట్‌బిన్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతోంది. ఈ డస్ట్‌ బిన్‌ను చూసిన ఆ దేశానికి వచ్చిన పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ డస్ట్‌ బిన్‌లో ఉన్న అంత స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పర్యావరణ పరిరక్షణలో డస్ట్‌బిన్స్‌ పాత్ర కీలకమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చుట్టు పక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్తను డస్ట్‌ బిన్స్‌లో వేయాలని ప్రభుత్వాలు, అధికారులు సైతం పిలుపునిస్తుంటారు. అయితే కొందరు బద్దకంతోనో, ఏమవతుందిలే అన్న ఉద్దేశంతోనే చెత్తను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే అన్నట్లు హాంగ్‌కాంగ్‌కు చెందిన టెక్‌ నిపుణులు ఓ వెరైటీ డస్ట్‌బిన్‌ను తయారు చేశారు. అచ్చంగా రోబోను పోలినట్లు ఉండే ఈ డస్ట్‌ బిన్‌ మాట్లాడుతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది. నేరుగా ప్రజల దగ్గరకు వస్తూ 'చెత్త ఉంటే వెయ్యండి అంటూ' అడుగుతుంది. ప్రస్తుతం ఈ డస్ట్‌బిన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Tap to resize

Latest Videos

A post shared by Luckystarry (@luckystarry_hung)

 

undefined

హాంగ్‌కాంగ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డస్ట్‌బిన్‌ ప్రజలతో మాట్లాడుతుంది. 'నాకు చెత్త తినాలని ఉంది, మీ దగ్గర ఏమైనా ఉందా?' అనే వాయిస్‌తో డస్ట్‌బిన్‌ తిరుగుతోంది. ఆకలేస్తోంది అంటూ ఏడుస్తోంది. అంతేందుకు ఎదుట ఉన్న వ్యక్తులను గుర్తించి.. 'మీ దగ్గర ఏమైనా చెత్త ఉందా.?' అంటూ ప్రశ్నిస్తోంది. దీంతో ఎవరైనా చెత్త వేస్తే వెంటనే 'యమ్మీ.. యమ్మీ' అంటూ సంతోషిస్తుంది. ఇదంతా ఆ డస్ట్‌బిన్‌లో ప్రీలోడ్‌ వాయిస్‌ రికార్డ్ ద్వారా ప్లే అవుతోంది.

 

దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా ఇది మంచి ఆలోచన అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ఈ డస్ట్‌బిన్‌ రోబో బాగా ఉపయోగపడుతుందని కొందరు అంటే, మరికొందరు ఇది భారత్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే నిరూపించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

click me!