ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అయితే బైక్ ధరలు కాస్త తక్కువ ఉండేవి కాని.. ప్రస్తుతం ఏ బైక్ అయినా రూ.లక్షకు పైగా ధర పలుకుతోంది. అయితే వాటి ఫీచర్స్ కూడా అదే రేంజ్ లో అప్ డేట్ అయి వస్తున్నాయి. పవర్, పెర్ఫార్మెన్స్, మైలేజ్ ఇలా అన్నింటిలోనూ బెస్ట్ ఇవ్వడానికి టూ వీలర్ కంపెనీలు పోటీపడుతున్నాయి. రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా ఉండే అనేేక కంపెనీల బైకులు మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో రూ.లక్ష లోపు ధర ఉండి, 60 కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
TVS రైడర్ 125
TVS రైడర్ 125 రూ. 85,000 నుండి రూ. 1.04 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ బైక్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 11.2 bhp పవర్, 11.75 Nm టార్క్‌తో 125cc ఇంజిన్ ఉంది. ఇది లీటరకు 67 km మైలేజ్ ఇస్తుంది. ఇది బెస్ట్ ఇంజన్ సెగ్మెంట్ లో ఒక బైక్ గా గుర్తింపు పొందింది.
హోండా SP 125
హోండా SP 125 మంచి ధర, పెర్ఫార్మెన్స్ కలిగిన బైక్. 10.72 bhp పవర్, 10.9 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తూ బెస్ట్ ఇంజిన్ కెపాసిటీతో ఈ బైక్ నడుస్తుంది. రూ. 87,468 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర కలిగిన ఈ బైక్ వేర్వేరు డీలర్ల దగ్గర ఇంకా తక్కువ ధరకు లభిస్తుంది. స్టైలిష్ బైక్ కోసం చూసేవారికి ఇది సరైనది. 65 kmpl మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R
హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 125R స్టైలిష్ లుక్ కలిగిన బెస్ట్ బైక్స్ లో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 95,000. 125cc ఇంజిన్, 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్ కెపాసిటీతో పనిచేస్తుంది. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి లీటరుకు 66 km పరుగెడుతుంది. ఇది యువ రైడర్లలో బాగా నచ్చిన బైక్ గా ఫేమస్ అయ్యింది.
బజాజ్ పల్సర్ N125
బజాజ్ పల్సర్ N125 స్పోర్టి డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్‌తో యువతను ఆకర్షిస్తున్న బైక్ ఇది. మార్కెట్ లో దీని ధర రూ. 92,704 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది. ఈ బైక్‌లోని 125cc ఇంజిన్ 11.8 bhp పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 60 km మైలేజ్ ఇస్తుంది. కాలేజీ యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి.