పెళ్ళిసందD చిత్రంతో శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకు వచ్చింది. ధమాకా చిత్రంతో శ్రీలీల పేరు మారుమోగింది. ఆమె డ్యాన్స్, క్యూట్ నెస్ తో ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎలాంటి తడబాటు లేకుండా అందంగా డ్యాన్స్ చేస్తుండడం, ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయింది.