మీ బాడీ లాంగ్వేజ్ మీ వ్యక్తిత్వాన్ని పట్టిస్తుంది.. ఎలాగంటే...

First Published Oct 4, 2021, 3:07 PM IST

ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి వారు ఎలాంటివారో? వారి వ్యక్తిత్వం ఏంటో? వారు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారా? మీతో మాట్లాడడం వారికి ఇష్టమేనా? వారిలో నాయకత్వ లక్షణాలున్నాయా? లేక చెప్పింది విని పనిచేసే కార్యకర్తా? ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు.. 

ఎదుటివారి గురించి తెలుసుకోవడం అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే వారిగురించి, వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే వారితో మాట్లాడడమో, కలిసి కాపేపు గడపడమో చేయాలనుకుంటారు. అయితే ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి వారు ఎలాంటివారో? వారి వ్యక్తిత్వం ఏంటో? వారు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారా? మీతో మాట్లాడడం వారికి ఇష్టమేనా? వారిలో నాయకత్వ లక్షణాలున్నాయా? లేక చెప్పింది విని పనిచేసే కార్యకర్తా? ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు.. 

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు నిపుణులు. సో వీటిని ఓ సారి గట్టిగా చూస్తే.. మీలోని షెర్లాక్ హోమ్స్ ను నిద్ర లేపొచ్చు. ఇక ఎదుటివారి దేహభాషను బట్టి వారిని అంచనా వేయచ్చు.. ఎందుకు ఆలస్యం మరి పని మొదలెట్టండి..

ఎవల్యూషన్ అండ్ పవర్ : మీతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారి పదే పదే ముక్కు మీద రుద్దుకోవడం, చేతివేళ్లు ముక్కుమీదికి తీసుకువెడుతున్నారంటే వారు మిమ్మల్ని వ్యతిరేక దృష్టితో చూస్తున్నట్టు అర్థం. 

ఇక ఎదుటివారి భుజాలు వంగినట్టుగా కాకుండా వెనక్కి నెట్టబడ్డట్టుగా ఉంటే.. వారు చాలా ధైర్యవంతులు,  శక్తివంతులని అర్థం. 

నిర్ణయాలు తీసుకునే స్వభావం, విశ్వాసం..
మాట్లాడుతున్నప్పుడు పదే పదే చెవుల్ని.. ఆ చుట్టు పక్కల ప్రాంతాన్ని తాకుతున్నట్టో సరిచేసుకుంటున్నట్లో ఉంటే ఆ వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనకబడి ఉంటాడని అర్థం. 

అదే ఎదుటివారికి మీరు మెచ్చుకున్నప్పుడు మరీ తలను వంచేస్తున్నారా..? అయితే ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం లోపం ఉందని, ప్రతీ దానికి సిగ్గుపడతాడని అర్థం.

ఇంట్రెస్ట్ అండ్ వల్యునరబిలిటీ 
మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు  తల ఊపుతున్నారా? అయితే మీ  సంభాషణపై వాళ్లు ఆసక్తి చూపుతున్నారన్నమాట. అయితే, మామూలు కంటే తలను మరీ ఎక్కువగా ఊపుతున్నారంటే.. వారికి మీ సంభాషణలో ఎలాంటి ఆసక్తీ లేదు. కానీ మిమ్మల్ని నొప్పించడం కానీ, ఇబ్బందిపెట్టడం కానీ ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. 

ఇక మీకు చేయి అందిస్తున్నప్పుడు అరచేతులు పైకి ఉంటే, ఆ సమయంలో ఆ వ్యక్తి మీతో చాలా ఓపెన్ గా ఉన్నాడని అర్థం. 

రెస్పెక్ట్ అండ్ కంట్రోల్ : 
ఎవరైనా తన బొటనవేలిని ఎవరికైనా చూపిస్తే, అతను లేదా ఆమెకు వారి పట్ల గౌరవం లేది ఇది చూపిస్తుంది. అలాగే మీ మొత్తం చేతిని మరొకరి వైపు చూపడం అనేది వారిని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నట్టుగా సూచిస్తుంది. 

సహనం, అసమ్మతి

మీతో మాట్లాడే సమయంలో ఎదుటివారు మెడను పదే పదే తడుముకుంటూ, గీరుకుంటూ ఉంటే అది నిజంగా ఆరోగ్య సమస్యైన దురద కాకపోతే, వారు బహుశా మీతో విభేదిస్తున్నారని అర్తం. 
ఎవరైనా కూర్చొని, మోకాళ్లపై చేతులు వేసి ముందుకు వంగారంటే.. ఆ వ్యక్తి వెళ్లిపోవాలనుకుంటున్నారని అర్థం.

మాట్లాడేటప్పుడు మీ కళ్లలోకే సూటిగా చూస్తూ మీరు ఇబ్బంది పడేలా చేస్తున్నట్లేతే.. వారు మీతో అబద్దం ఆడుతున్నట్టుగా అర్థం. రెప్పవేయకుండా అలాగే మిమ్మల్ని చూస్తున్నట్లైతే మిమ్మల్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నట్టు. 

click me!