టెలికాం రూల్స్ మారిపోతున్నాయి.. జియో, ఎయిర్‌టెల్, VI, BSNL లాభమా? నష్టమా?

First Published | Nov 24, 2024, 12:34 PM IST

భారత ప్రభుత్వం కొత్త టెలి కమ్యూనికేషన్స్ నియమాలను అమలు చేయనుంది. ఈ రూల్స్ 5G సౌకర్యాలపై ప్రభావం చూపనున్నాయి.  వీటి వల్ల జియో, ఎయిర్‌టెల్, వోడా, BSNLకు లాభమా? నష్టమా? తెలుసుకుందాం రండి.  

టెలికమ్యూనికేషన్స్ నియమాలను మార్చి కొత్త ‘రైట్ ఆఫ్ వే’ (RoW) నియమాలను అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల జియో, ఎయిర్‌టెల్, వోడా, BSNLపై ప్రభావం పడనుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ నియమాలను ఎప్పటికప్పుడు మారుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ చట్టంలో కొన్ని కొత్త నియమాలు చేర్చారు. ఇకపై వాటిని కూడా పాటించాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ నియమాలు అమలయ్యేలా చూడాలని కోరింది.

‘రైట్ ఆఫ్ వే’ (RoW) నియమాలను ప్రతి రాష్ట్రం, అన్ని టెలికాం సంస్థలు అంగీకరించాలని, ఈ మేరకు ఇబ్బందులు ఏమైనా ఉంటే నవంబర్ 30 లోపు తెలియజేయాలని కూడా కేంద్రం కోరింది. కొత్త నియమాలు జనవరి 1 నుండి అమలులోకి రానున్నాయి. ఈ విషయమై అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు DoT కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఇప్పటికే లేఖ రాశారు.

Latest Videos


RoW పోర్టల్ కొత్త నియమాలు జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. కొత్త రూల్స్ అమలులోకి వస్తే ఆప్టికల్ ఫైబర్, టెలికాం టవర్లు ఎక్కువగా ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్లు, ప్రొవైడర్లు కూడా కొత్త రూల్స్ వల్ల చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు.

RoW నియమాలను సింపుల్ గా చెప్పాలంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై టవర్లు ఎక్కువగా ఏర్పాటు చేయవచ్చు. ఇవి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా టెలికాం సేవలను పెంచేలా ఉంటాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణిస్తూ టెలికమ్యూనికేషన్స్ సదుపాయాలను మెరుగు పరచడమే RoW నియమాల ముఖ్య ఉద్దేశం. అందుకే టెలికమ్యూనికేషన్స్ సదుపాయాలను ఆధునీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రైవేటు ఆస్తి యజమానులు, టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్లు RoW నియమాలను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. 

RoW కొత్త నియమాల్లో 5G కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయడానికి టవర్లను ఎక్కువగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో జియో, ఎయిర్ టెల్, వొడా, బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మరింత వేగంగా అందనున్నాయి. RoW కొత్త నియమాలు టెలికాం సంస్థలకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి. ఇకపై అన్ని టెలికాం సంస్థలు 5G సేవలను ఎక్కువగా అందిస్తాయన్న మాట.

click me!