Best Dress for Slim Girl : స్లిమ్ గా ఉన్నవారికి ఇలాంటి డ్రెస్సులు అస్సలు బాగోవు..

First Published Jan 27, 2022, 3:59 PM IST

Best Dress for Slim Girl : బక్క పల్చగా ఉన్నవాళ్లకు కొన్ని రకాల డ్రెస్సుల అస్సలు సూటి కావు. ముఖ్యంగా పార్టీలకు వెళ్లే సమయంలో కొన్ని రకాల డ్రెస్సులను ధరించకూడదు. ఎందుకంటే అవి మనల్ని మరింత సన్నగా కనబడేలా చేస్తాయి గనుక. 
 


Best Dress for Slim Girl : బక్కగా ఉన్నవారు పార్టీలకు, Function లకు వెళ్లేటప్పుడు కొన్ని రకాల దుస్తులను అస్సలు ధరించకూడదు. ఎందుకంటే అలాంటి వాటిని ధరిస్తే మీరు మరింత సన్నగా కనబడే ప్రమాదం ఉంది. అందుకే సన్నగా ఉండేవారు ఎలాంటి దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు.. ఎలాంటి వాటిని ధరించకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.


సన్నగా ఉండేవారు ఎక్కువగా ప్రకాశవంతంగా మెరిసిపోయే దుస్తులను ఎంచుకోవాలి. అలా అని చాలా మంది నలుపు రంగునే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ నలుపు రంగును సన్నగా ఉండేవారు ధరిస్తే వారు మరింత సన్నగా కనబడేలా చేస్తుంది. అందుకే సన్నగా ఉన్న ఆడవారు బ్లాక్ కలర్ దుస్తులను వేసుకోకపోవడమే బెటర్. 
 

బక్కగా ఉండే వారికి బిగ్గరగా ఉండే దుస్తులు అస్సులు బాగోవు. ఎందుకంటే ఆ డ్రెస్సులో వారు మరింత సన్నగా కనిపించేలా చేస్తాయి. అందుకే టైట్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీ హగ్గింగ్ దుస్తులు కూడా సన్నగా కనబడేలా చేస్తాయి. అందుకే బక్కగా ఉన్నవాళ్లు బిగువుగా ఉండే దుస్తులకు బదులుగా లూస్ గా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వాటిని వేసుకుంటే బాగుంటుంది. 

ప్యూర్ కాటన్ దుస్తులు కూడా మిమ్మల్ని నలుగురిలో మెరిసిపోయేలా చేస్తాయి. మందమైన ఫాబ్రిక్ లో మీకు నచ్చే.. అందంగా కనిపించే రంగుల దుస్తులను ఎంచుకుని ధరించండి. ఈ బట్టలు మిమ్మల్ని లావుగా, అందంగా కనిపించేలా చేస్తాయి. 


పొడవాటి గీతలున్న డ్రెస్సులను అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ డ్రెస్సులు మిమ్మల్ని మరింతగా సన్నగా మార్చవచ్చు. అందుకే శరీరం సన్నగా ఉన్నవాళ్లు పొడవాటి చారలున్న దుస్తులను ధరించకండి. వీటికి బదులుగా క్రాస్ లైన్లు ఉన్న డ్రెస్సులను వేసుకోండి.

మీ స్లిమ్ లుక్ ను కప్పిపుచ్చడానికి రెండు మూడు లేయర్లున్న దుస్తులు బాగా ఉపయోగపడతాయి. వీటిని ధరించడం వల్ల మీరు బొద్దుగా, మరింత స్టైల్ గా కూడా కనిపిస్తారు. ఇలాంటి డ్రెస్సులు లీన్ ఫిజిక్ ను దాస్తాయి. 

సన్నగా ఉండే ఆడవారికి ప్రింటెడ్ డ్రెస్సులు బాగా నప్పుతాయి. అందులోనూ ఇలాంటి డ్రెస్సులు మీరు సన్నగా ఉన్నారన్న విషయాన్ని దాస్తాయి. డిజిటల్ ప్రింట్, పూలు, గ్రిడ్ లు ఉండే హెవీ ప్రింటెడ్ డ్రెస్సులను ఎంచుకోండి. ఇలాంటి డ్రెస్సులు మీకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ సాదగా ఉండే దస్తులను వేసుకోకపోవడమే ఉత్తమం. 

click me!