coffee powder: కాఫీ పొడితే అందానికి మెరుగులు దిద్దండిలా..

First Published Jan 22, 2022, 1:49 PM IST

coffee powder: ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మనసుకు, శరీరాని సరికొత్త ఉత్తేజం వస్తుందన్న సంగతి మనందరికీ  తెలిసిందే. అయితే కాఫీ తాగడంతో పాటుగా.. అదిరిపోయే అందానికి కూడా ఉపయోగపడుతుందని ఎవరికైనా తెలుసా.. అవును కాఫీ పౌడర్ తో అందానికి మెరుగులు దిద్దొచ్చు.. 
 

coffee powder: కాఫీ తాగడానికే కాదు.. అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా వాడుతుంటారు. ఈ కాఫీ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు సున్నితమైన చర్మకణాలు దెబ్బతినకుండా రక్షించే గుణాలను కలిగి ఉంటుంది. అందుకే చాలా మంది యువతులు కాఫీ పౌడర్ తో అందానికి మెరుగులు దిద్దుకుంటారు. ఈ కాఫీ పౌడర్ తో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

కాఫీలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది.  ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో ముందుంటుంది. అలాగే ఈ కాఫీలో నాచురల్ బ్లీచింగ్ కూడా పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను మటుమాయం చేస్తుంది. ఈ పొడిని ఎలా ఉపయోగించాలంటే.. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకుని అందులో ఐదు చుక్కల విటమిన్ ఇ నూనెను, ఒక టీ స్పూన్ Honey ని వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కళ్ల కింద సున్నితంగా అప్లై చేయాలి. పావుగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత నీట్ గా వాష్ చేసుకోవాలి.

చర్మం అందంగా మెరిసిపోవాలంటే.. కొంత మొత్తంలో కాపీ పౌడర్ ను తీసుకోవాలి. అందులో మూడు చిన్న చెంచాల కలమంద జెల్ ను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు అలాగే ఉంచి శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి ఒక సారి చేసినా మీ ముఖం సహజ సిద్దమైన అందాన్ని పొంది నిగనిగ మెరిసిపోతుంది.   

ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు పోవాలంటే కాఫీ పౌడర్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది.  కాఫీ పౌడర్ ను ముఖానికి మాస్క్ లా వేయడం వల్ల ముఖం నిగనిగ మెరిసిపోతుంది. దీనికోసం ఏం చేయాలంటే.. కొద్ది మోతాదులో కాఫీ పొడిని, కోకా పొడిని తీసుకుని పేస్టులా మారేందుకు అవసరమయ్యే పాలను పోసుకుని బాగా మిక్స్ చేయాలి. అలాగే ఆ పేస్ట్ లో కొన్ని చుక్కల నిమ్మరసం, తేనెను వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా పెట్టుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. 


మొటిమల సమస్యను దూరం చేయడంలో కాఫీ పౌడర్ ముందుంటుంది. అందులోనూ మొటిమలు రావడానికి కారణమయ్యే బ్యాక్టిరియాను అంతం చేయడానికి ఈ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం.. కాఫీ పౌడర్ ను మూడు టేబుల్ స్పూన్లు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల షుగర్ ను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఒక పదినిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకుంటే సరి. 

click me!