పిల్లలకు ఈ పేర్లు పెట్టడం అక్కడ నేరం తెలుసా..?

First Published Dec 7, 2021, 1:09 PM IST

జపాన్ లో తల్లిదండ్రులు ఎవరూ.. తమ పిల్లలకు అనుమ అనే పేరు పెట్టడానికి లేదట. అక్కడ ఆ పేరును రద్దు చేశారు. ఎందుకంటే అనుమ అంటే.. దెయ్యం అని అర్థం వస్తుందట. అందుకే.. ఆ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తారు.

కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి.. అమ్మాయి పుడితే ఏం పేరు పెట్టాలి..? అబ్బాయి పుడితే ఏం పేరు పెట్టాలి అని తల్లిదండ్రులు తెగ ఆలోచించేస్తారు. నక్షత్రం పేరు పెట్టాలని కొందరు.. తమ పేరులోని అక్షరాలను కలిపి పేరు పెట్టాలని మరికొందరు ఆలోచిస్తుంటారు. ఇంకొందరు.. తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. కొన్ని దేశాల్లో.. పిల్లలకు కొన్ని పేర్లు పెట్టడాన్ని నేరంగా భావిస్తుంటారట మరి ఆ పేర్లు ఏంటి..? ఆ దేశాలేంటో ఓసారి చూద్దాం..


హిట్లర్..ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు.  ఈ వ్యక్తిని ప్రేమించేవారు ఎంత మంది ఉంటారో.. ద్వేషించేవారు కూడా అంతే ఉంటారు. ఈ పేరును.. తమ పిల్లలకు పెట్టాలని ఆశపడేవారు చాలా మందే ఉంటారు. అయితే.. తమ పిల్లలకు హిట్లర్ పేరు పెట్టడాన్ని జర్మనీ, మలేసియా, మెక్సికో, న్యూజిలాండ్ దేశాల్లో నేరంగా భావిస్తారట.

baby

ఇక.. జపాన్ లో తల్లిదండ్రులు ఎవరూ.. తమ పిల్లలకు అనుమ అనే పేరు పెట్టడానికి లేదట. అక్కడ ఆ పేరును రద్దు చేశారు. ఎందుకంటే అనుమ అంటే.. దెయ్యం అని అర్థం వస్తుందట. అందుకే.. ఆ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తారు.

సౌదీ అరేబియాలో.. ఎవరూ తమ పిల్లలకు అమీర్ అనే పేరు పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే.. అమీర్ అంటే.. రాజకుమారుడు అని అర్థమట. అది రాజరికానికి సంబంధించిది. అందుకని సామాన్యులు ఎవరూ ఆ పేరు పెట్టడానికి లేదు.

న్యూజిలాండ్ లో అనల్ అనే పేరుని బ్యాన్ చేశారు. ఎందుకంటే.. అనల్  అనేపేరు.. అసభ్యతకి అర్థంగా భావిస్తారట. అందుకే.. ఆ దేశంలో అక్కడ.. ఎవరూ తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టకూడదట.

ఇక డెన్మార్క్ లో అనుస్ అనే పేరును బ్యాన్ చేసేశారు. అనుస్ అంటే.. శరీరంలోని ఓ  భాగం అనే అర్థం వస్తుందట. అందుకని.. ఆ పేరును అక్కడ ఎవరికీ పెట్టడానికి వీలు లేదని చెప్పారు.

పోర్చుగల్ లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అశాంతి అనే పేరు పెట్టడానికి లేదు. ఆ పేరు మంచి అర్థం ఉండదని వారి నమ్మకం. అందుకే ఆ పేరు పెట్టడానికి లేదు.

ఇక.. చావ్ టావ్ అనే పేరు ని కూడా పలు దేశాల్లో బ్యాన్ చేశారు. మలేషియా, విక్టోరియా, ఆస్ట్రేలియాలో.. ఈ పేరు నిషేదం. ఈ పేరు అర్థం.. దుర్వాసన ఇచ్చే తల అని అర్థం. అందుకే ఆపేరు పెట్టడానికి లేదు.
 

newborn baby

యూకేలో తల్లిదండ్రులు ఎవరూ తమ పిల్లలకు సైనేడ్ అనే పేరు పెట్టడానికి లేదు. సైనేడ్ అంటే.. భయంకరమైన విషం అని అర్థం. అందుకే.. ఆ పేరు పెట్టడానికి లేదు.

ఐర్లాండ్ లో తల్లిదండ్రులు.. తమ పిల్లలకు ఎన్రిక్ అనే పేరు పెట్టడానికి లేదు. అక్కడ విదేశీ పేర్లను అనుమతించరు.
 

click me!