మైసూర్ ట్రిప్ కు వెళ్తున్నారా... అయితే ఈ ప్రదేశాలు అస్సలు మిస్ అవ్వకండి!

First Published Nov 3, 2021, 4:27 PM IST

మైసూర్ (Mysore) లో జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఉత్సవాలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మైసూర్ మహారాజు కులదైవమైనా చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ తో పాటు ఉన్న అందమైన ప్రదేశాల గురించి తెలుసుకోవడం.
 

కర్ణాటక లోని 3వ అతిపెద్ద నగరం మైసూర్. కర్ణాటక రాష్ట్ర చరిత్రకు, సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకగా (Symbol) నిలుస్తుంది. కన్నడ భాషలోని మహిషా, మహిసురుడు అనే పదాల నుంచి మైసూర్ పేరు వచ్చింది. అందుకే ఈ ప్రాంతానికి మైసూర్ (Mysore) అనే పేరు వచ్చింది.
 

గందపు చెక్కల సువాసనలు, గులాబీల గుభాళింపులతో మైసూర్ నగరానికి శాండిల్ వుడ్ (Sandle wood) అనే పేరు వచ్చింది. మైసూర్ ప్రాంతం పర్యాటకులకు ఇండియాలోనే అత్యంత ఆకర్షణీయ ప్రదేశాలల్లో ఒకటిగా ఉంది. మైసూర్ (Mysore) లో అనేక తోటలు, సరస్సులు, బటర్ ఫ్లై పార్క్, చందనం తోటలకు ఎక్కువగా ఉంటాయి . ఇప్పుడు అక్కడున్న అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం...
 

చాముండేశ్వరి ఆలయం: చాముండేశ్వరి దేవి (Chamundeshwari Devi) ఆలయం కొండలపై (Hills) ఉంది. చాముండేశ్వరి దేవాలయం మైసూరు (Mysore) నగరానికి సుమారు 13 కిమీ దూరంలో ఉంది. భారతదేశంలోని 18 మహాశక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి.
 

పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు పాలించేవాడు. సగం రాక్షసుడు సగం దున్న  (Buffalo) రూపంలో ఉండడం వల్ల ఆ రాక్షసుణ్ణి (Monster) మహిషాసురుడు అని పిలిచేవారు. ప్రజలను ఈ రాక్షసుని బారి నుంచి కాపాడడానికి చాముండేశ్వరి దేవి అవతరించిందని పురాణాలు చెబుతుంటాయి.
 

శ్రీ రంగనాథ స్వామి ఆలయం: శ్రీ రంగనాథ స్వామి ( Sri Ranganatha Swamy) ఆలయం కావేరీ నది (Kaveri river) ఒడ్డున ఉంది. ఇక్కడ ఎత్తైన గోపురం (Dome) ఉంది. కర్ణాటక లోని అతి ముఖ్యమైన యాత్రా స్థలాలలో కావేరీ నది ఒకటి. 
 

లలిత మహల్: లలిత మహల్ (Lalitha mahal) ని 1921 లో నిర్మించారు. భారతదేశంలోనే ఇది అత్యంత సంపన్నమైన హోటళ్ళుగా (Hotel) నిలిచింది. మైసూర్ నగరంలో రెండవ అతి పెద్ద రాజభవనం లలిత మహల్. చాముండి హిల్స్ కు దగ్గరలో లలితా మహాల్ ఉంది. 
 

చాముండి హిల్స్ నంది: చాముండి హిల్స్ (Chamundeshvari hills) నంది ఏకశిలా విగ్రహం. మైసూర్ (Mysore) లోని చాముండి కొండల ఎగువన అతి పెద్ద నంది విగ్రహం ఉంది. భారతదేశంలో ఉన్న నంది విగ్రహాలలో అతి ఎత్తైన విగ్రహం చాముండేశ్వరి హిల్స్ నంది.  
 

మైసూర్ ప్యాలెస్: భారతదేశంలో అత్యంత సందర్శక ప్రదేశాలలో మైసూర్ ప్యాలెస్ (Mysore place) ఒకటి. అద్భుతమైన చారిత్రాత్మక భవనం. మైసూర్ ప్యాలెస్ దసరా (Dussehra) ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవిదేశాల నుంచి ప్రజలు ఇక్కడి ఉత్సవాలను చూడడానికి వస్తుంటారు.
 

శివన సముద్ర ఫాల్స్: శివన సముద్ర జలపాతం మైసూరు (Mysore) నుండి 85 కిలోమీటర్ల దూరంలో కావేరి నది ( Kaveri River) ఒడ్డున  ఉంది. ఈ  జలపాతం 98 మీటర్ల ఎత్తు ఉంది. మొదటి జల విద్యుత్తు పవర్ స్టేషన్ లలో ఒకటిగా ప్రసిద్ది చెందినది.
 

నంజన్ గూడ్: ఈ నగరంను దక్షిణ కాశీ (Dhakshina kasi) అని కూడా పిలుస్తారు. నంజన్ గూడ్ పట్టణం కపిల నది ఒడ్డున ఉంది. ఇది శ్రీకంఠేశ్వర దేవాలయంకు (Srikanteshvara temple) ప్రసిద్ది చెందింది. నంజన్ గూడ్ వివిధ రకాల అరటి పండ్ల తోటలకు ప్రసిద్ధి.

click me!