సూర్యనమస్కారాలు చేసే ముందు.. ఖచ్చితంగా చేయాల్సినవేంటో తెలుసా...

First Published Sep 9, 2021, 3:16 PM IST

సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? సూర్యనమస్కారాలు చేసేప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేవాటిమీద చాలా సమాచారం అందుబాటులో ఉంది. అయితే సూర్యనమస్కారాలు చేసే ముందు శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలి అనేది మాత్రం తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

సూర్యనమస్కారాలు.. తిరుగులేని వ్యాయామవిధానం. వెన్నుముక, కండరాలకు మంచి వ్యాయామం. సూర్యనమస్కారాల వల్ల శరీరం పూర్తిగా వ్యాయామం అవుతుంది. దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి పరికరాలు లేకుండా చేయవచ్చు.

అయితే సూర్యనమస్కారాలను సరైన రీతిలో చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజులో ఏ సమయంలోనైనా సూర్యనమస్కారాలను చేయగలిగినప్పటికీ, మంచి ఫలితాలు కావాలంటే.. సూర్యోదయం సమయంలోనే సూర్యనమస్కారాలను చేయడం ఉత్తమం. 

సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? సూర్యనమస్కారాలు చేసేప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేవాటిమీద చాలా సమాచారం అందుబాటులో ఉంది. అయితే సూర్యనమస్కారాలు చేసే ముందు శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలి అనేది మాత్రం తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

వాకింగ్ : సూర్యనమస్కారాలకు మీ శరీరాన్ని సిద్ధం చేయడానికి వామప్ చాలా ముఖ్యం. అందులో ఒకటే వాకింగ్. సూర్యనమస్కారాలకు ముందు మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. అయితే మరీ మెల్లగా నడవకండి. వాకింగ్ తరువాత మీ గుండె వేగం పెరిగేలా నడవండి. 

మెట్లు ఎక్కడం : సూర్యనమస్కారాలకు ముందు చేయాల్సి మరో వామప్ ఎక్సర్ సైజ్ మెట్టు ఎక్కడం. మెట్లు ఎక్కడం వల్ల బాడీ అంతా కదిలి.. కండరాలు, ఎముకలు ఫ్రీ అవుతాయి. అందుకే సూర్యనమస్కారాలకు ముందు కొన్ని మెట్లైనా ఎక్కడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

స్ట్రెచెస్ : సూర్యనమస్కారాలకు ముందు వాకింగ్, మెట్లెక్కడం వల్ల అలిసిపోతాం అనిపిస్తే.. స్ట్రెచెస్ మీకు మంచి వ్యాయామంగా పనికొస్తాయి. చేతులు, కాళ్లు శరీరం మొత్తం రిలీఫ్ అయ్యేలా సింపుల్ స్ట్రెచెస్ చేయచ్చు. 

స్పాట్ జాగింగ్ : సూర్యనమస్కారాలకు ముందు స్పాట్ జాగింగ్ కూడా మంచి ఆఫ్షనే. అంటే అక్కడక్కడే జాగింగ్ చేయడం. ఇది చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ మెథడ్. దీనివల్ల మీ జీవక్రియ మెరుగుపడుతుంది. మంచి వ్యాయామం కోసం మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

ఫుల్ బాడీ రొటేషన్ : సూర్యనమస్కారాలకు ముందు శరీరం మొత్తాన్ని పార్టులు పార్టులుగా రొటేట్ చేయడం వల్ల ఫ్రీ అవ్వొచ్చు. హెడ్ రొటేట్, భుజాలు, మోకాళ్లు..నడుము భాగాలను రొటేట్ చేయడం వల్ల శరీరం వ్యాయామానికి సిద్దమవుతుంది. 

సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని చెప్పుకున్నాం కదా.. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. 
- బరువు తగ్గడానికి సహాయపడుతుంది
- చర్మాన్ని మెరిసేలా చేస్తుంది 
- జుట్టు ఆరోగ్యానికి మంచిది
- థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపిస్తుంది, హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది
- రుతు చక్రాన్ని నియంత్రిస్తుంది
- కండరాలు, కీళ్లను బలపరుస్తుంది
- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
- బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది
- ఆందోళనను తగ్గిస్తుంది
- శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది
- రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది

సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని చెప్పుకున్నాం కదా.. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. 
- బరువు తగ్గడానికి సహాయపడుతుంది
- చర్మాన్ని మెరిసేలా చేస్తుంది 
- జుట్టు ఆరోగ్యానికి మంచిది
- థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపిస్తుంది, హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది
- రుతు చక్రాన్ని నియంత్రిస్తుంది
- కండరాలు, కీళ్లను బలపరుస్తుంది
- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
- బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది
- ఆందోళనను తగ్గిస్తుంది
- శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది
- రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది

click me!