వేసవి కాలంలో మనల్ని చాలా రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ లో చెమట కారణంగా మరిన్ని ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. మహిళలకు అయితే... ప్రైవేట్ పార్ట్స్ అంటే యోనిలో దురద, మంట, పొడిబారడం వంటి అనేక సమస్యలు కామన్ గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే.. ఇలాంటి సమస్యల గురించి కనీసం వైద్యులతో చెప్పడానికి కూడా మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే... యోనిలో దురద, చికాకు, పొడిబారడం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి..? గైనకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
vaginal cancer
ఎండాకాలంలో మంచినీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల.. శరీరం వేడిని పుట్టిస్తుంది. శరీరంలో నీరు తగినంత లేకపోవడం వల్ల... ప్రైవేట్ పార్ట్స్్ లో చికాకు, పొడి బారడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే.. ముందుగా నీరు ఎక్కువగా ఎక్కవ తాగడానికి ప్రయత్నించాలి. కనీసం రోజులో 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగాలి. వీలైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి కూడా తాగాలి. పుచ్చకాయ లాంటివి తినాలి.
ఇక వేసవిలో చెమట కారణంగా యోని ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలకు కారణం అవుతుంది. కాబట్టి.. అలాంటి సమయంలో.. బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. వీలైనంత వరకు వదులుగా ఉండేవి వేసుకోవాలి. ఇన్నర్ వేర్ కూడా కాటన్ వి ఎంచుకోవాలి. అప్పుడు ఆ ప్రాంతాలకు గాలి తగులుతుంది. చెమట రాకుండా నిరోధిస్తుంది.
అంతేకాకుండా.. యోని శుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. తరచూ యోని భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే... కాటన్ క్లాత్, టిష్యూతో తుడవాలి. దీని వల్ల మీకు యోని ప్రాంతంలో దురద లాంటివి రాకుండా ఉంటాయి.
వ్యాయామం చేయడం లేదంటే ప్రయాణం చేసే సమయంలో చెమట కారణంగా మీ ఇన్నర్ వేర్ తడిగా మారింది అనిపిస్తే.. వెంటనే దానిని మార్చేయాలి. లేదంటే అలానే ఉంచడం వల్ల... అనారోగ్యకరమైన బ్యాక్టీరియా పేరుకుపోతుంది. కాబట్టి.. వెంటనే ఇన్నర్ వేర్ మార్చేసుకోవాలి. అంతేకాదు.. ఊరికూరికే యోని భాగాన్ని నీటితో కడగకూడదు. దాని వల్ల యోని చాలా తొందరగా పొడి బారుతుంది. అంతేకాదు.. స్ప్రేలు, సువాసన కలిగిన ఉత్పత్తులను యోని ప్రాంతంలో వాడకూడదు. ఇవి కూడా చికాకు కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.