బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

Published : May 01, 2024, 03:48 PM IST

ఆడవాళ్లే కాదు మగవారు కూడా మెడలో చెయిన్, చేతికి ఉంగరాలను, బ్రేస్ లెట్ వంటి బంగారు నగలను పెట్టుకుంటుంటారు. అయితే ఈ బంగారు నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  

PREV
15
బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. డబ్బులుంటే చాలు బంగారు షాపుకు వెళ్లి నచ్చిన నగలను కొంటుంటారు. చేతికి గాజులు, చెయిన్, చెవులకు కమ్మలు, ముక్కు పుడక వంటివి కొంటూనే ఉంటారు. బంగారు ఆభరణాలను ధరించి ఆడవాళ్లు తెగ మురిసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ధరించే బంగారు ఆభరణాల వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అసలు ఆడవాళ్లు బంగారు ఆభరణాలను పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

ముక్కు పుడక 

పెళ్లైన వారే కాదు పెళ్లి కాని అమ్మాయిలు కూడా ముక్కు పుడకను ఖచ్చితంగా పెట్టుకుంటారు. అయితే ఆడవాళ్లకు ముక్కు పుడక ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు ముక్కు పుడకను పెట్టుకోవడం వల్ల వారి కోసం అదుపులో ఉంటుందట. అంతేకాదు ముక్కు పుడక వల్ల కొన్ని నరాలు బలపడి మహిళల్లో పీరియడ్స్ పెయిన్స్ తగ్గుతుందని నమ్ముతారు. 
 

35

బంగారు చెవిపోగులు

ఆడవాళ్లు పెట్టుకునే బంగారు చెవి పోగులు కూడా వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. అవును బంగారు చెవి పోగులను పెట్టుకోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం అస్సలు ఉండదట. ఇది చెవులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

45

బంగారు గొలుసు

గొలుసులు, నెక్లెస్ లు వంటి బంగారంతో చేసిన ఆభరణాలు మనల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయట. ఈ బంగారు గొలుసులు ధరించడం వల్ల అంటు వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని చెప్తారు. అలాగే ఇది శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరగడానికి కూడా సహాయపడుతుంది.
 

55

 డిప్రెషన్ నుంచి ఉపశమనం 

ప్రస్తుతం బంగారం ధర కొండెక్కింది. సామాన్యులు కొనలేని రేటుకు బంగారం ధర చేరింది. కానీ మన దగ్గర ఎంతో కొంత బంగారం ఉంటే మనం గడ్డు పరిస్థితులకు భయపడాల్సిన అవసరం ఉండదు. బంగారం ఉంటే జీవితంలో ఆత్మవిశ్వాసం దానంతట అదే వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories