అఫ్ఘాన్ మహిళల ఉద్వేగాలు వెదజల్లే కుడ్య చిత్రాలు ఇవే.. ఆ డ్యాషింగ్ ఆర్టిస్టు ఎవరంటే?

First Published Sep 17, 2021, 5:08 PM IST

ఆఫ్ఘనిస్తాన్‌లో 20ఏళ్ల యుద్ధంలో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరికి తాలిబాన్ల ప్రభుత్వ ప్రకటన, ప్రజలపై ముఖ్యంగా మహిళలపై ఆంక్షలతో అంధకార భవితంపై ఎంతో మందికి బెంగ పుట్టుకొచ్చింది. యుద్ధంతో ఛిద్రమైన ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితులు, అక్కడి మహిళల భావాలను స్పష్టంగా వివరిస్తున్న కుడ్య చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

afghanistan

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పగిలిన అద్దంగా మారింది. ప్రత్యేక సంస్కృతి, జీవన విధానమున్న ఆ దేశం ఇప్పుడు యుద్ధంతో ఛిద్రమైపోయింది. పురుషాధిక్యంతో తాలిబాన్లు విర్రవీగుతున్నారు. ఆ దేశ సంస్కృతికి
భిన్నంగా ఎన్నో ఆంక్షల సంకెళ్లు అక్కడి మహిళలకు విధిస్తున్నారు. కానీ, ఆ వీర వనితలు అంతే దీటుగా ధిక్కరిస్తున్నారు. తోచిన మార్గాల్లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. తాజాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం నేపథ్యంలో మహిళ చిత్రవధను, వారి భావోద్వేగాలను మనకు విస్పష్టంగా వివరిస్తున్న కుడ్య చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఫీమేల్ స్ట్రీట్ ఆర్టిస్ట్ షంసియా హస్సానీ పవర్‌ఫుల్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె గురించి, ఆమె చిత్రాల గురించి తెలుసుకుందామా?

afghanistan

ఓ ఆఫ్ఘనిస్తాన్ శరణార్థి దంపతులకు ఇరాన్‌లో 1988లో షంసియా హస్సానీ జన్మించారు. 2005లో తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు. కాబూల్ యూనివర్సిటీలో పెయింటింగ్, ఫైన్ ఆర్ట్స్‌లో హస్సానీ డిగ్రీ పట్టా పొందాక ఆఫ్ఘనిస్తాన్ వీధులు, పేలుళ్లతో శిథిలమైన వీధి గోడలనే కాన్వాస్‌గా మలుచుకుంది. పురుషాధిపత్య సొసైటీలోమహిళా కోణంలో ఘటనలను చిత్రాల్లో వివరించింది. ఆయిల్, గ్రాఫిటీ పెయింటింగ్స్ వేసింది. గ్యాలరీలకు వెళ్లి చూసే పరిస్థితులు లేని ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల ముందు, వారి చుట్టూ కుడ్యాలపైనే చిత్రాలు వేసింది.

afghanistan

ఇటీవలే ఆమె వేసిన ఈ పెయింటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుపు రంగులో ఆయుధంతో కనిపిస్తున్న ఓ ఆకారం ముందు కుండీలో ఓ పూవును పట్టుకుని దిగులుగా నిలుచున్న బాలిక చిత్రం ద్వారా పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఇందువల్లేనే మా ఆశలు, కోరికలూ నల్లటి కుండీలో పెరిగాయేమో అని పేర్కొన్నారు.

afghanistan

మీరెవ్వరూ? మా జీవితాలను చిందరవందర ఎందుకు చేస్తున్నారో నాకెప్పుడూ అర్థం కాదు. తాలిబ్? ఐఎస్ఐఎస్ లేదా ఇంకెవరైనా.. అందరం కలిసి శాంతిని స్థాపించుకుందాం. నాకు నా దేశం, నా ఇల్లు వెనక్కి కావాలి. నా ప్రజల స్వేచ్ఛ, శాంతి కావాలి అంటూ పేర్కొన్న ఓ చిత్రంలో పూవులు పట్టుకున్న ఓ యువతి ఓ బాంబుల ట్యాంకుకు ఎదురుగా నిర్భయంగా వెళ్తుంటుంది.

afghanistan

యుద్ధ చిత్రాలే కాదు, రాలిపోయిన ఆశలను, నిస్సత్తువను, గాఢమైన అంధకారాన్ని, మరెన్నోవిదారక దృశ్యాలను, ఘటనలను మన మనసుకు దగ్గరకు చేస్తుంది.

afghanistan

కాబూల్ ఎయిర్‌పోర్టులో పేలిన బాంబుపై స్పందించి ఓ చిత్రం, ఆశలు ఆవిరైపోయాని మరోటి, మనసు కుదుటపరిచే మ్యూజిక్‌ను నిషేధించినందుకు ఇంకోటి.. ఇలా అనేక అవస్థలను ఆమె తన చిత్రాల్లో ప్రతిబింబించారు.

afghanistan

war torn afghanistan people facing critical situations. those incidents are depicting countys first wall street artist

click me!