PM Modi: ఇటలీ ప్రధానికి పీఎం మోడీ ఫోన్.. ఆ ఆంశాలపై కీలక చర్చ..

By Rajesh KarampooriFirst Published Apr 25, 2024, 10:18 PM IST
Highlights

PM Modi: ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో టెలిఫోన్ లో సంభాషించారు. ఇటలీ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి , వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఈ ఏడాది జూన్‌లో ఇటలీలోని పుగ్లియాలో జరగనున్న G7 సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా తనను ఆహ్వానించినందుకు మెలోనికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇటలీ నేతృత్వంలోని జీ7 సదస్సులో భారత్ నేతృత్వంలో జీ20 సదస్సులో ముఖ్యమైన ఫలితాలను ముందుకు తీసుకెళ్లడంపై ఇరువురు నేతలు చర్చించారు. 

జూన్ 2024లో ఇటలీలోని పుగ్లియాలో జరగనున్న G7 సమ్మిట్ కు  తనను ఆహ్వానించినందుకు PM మెలోనికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటలీ అధ్యక్షతన జరిగిన G7 సమ్మిట్‌లో .. భారతదేశ G20 ఛైర్మన్‌షిప్ జరిగిన ఆంశాలను చర్చించనున్నారు. గ్లోబల్ సౌత్‌కు మద్దతు ఇవ్వడంపై ఇద్దరూ ప్రత్యేకంగా చర్చించారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తితో కూడిన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై కూడా అభిప్రాయాలను వెల్లడించనున్నారు.  ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగించాలనే తమ నిబద్ధతను కూడా వారు పునరుద్ఘాటించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పేర్కొన్నారు.  

 ప్రధానమంత్రి మోదీ చివరిసారిగా దుబాయ్‌లో జరిగిన COP28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెలోనిని కలిశారు. ఈ సదస్సులో  సుస్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం భారత్-ఇటలీ ఉమ్మడి ప్రయత్నాల కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇద్దరు నేతలు తమ స్నేహాన్ని ప్రతిబింబిచేలా మెలోని భారత ప్రధానితో సెల్ఫీని ఆన్ లైన్ లో పోస్టు చేశారు. అలాగే.. గతేడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా మెలోని, ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో G20 భారత దేశ ఛైర్మన్‌షిప్‌కు ఇటలీ మద్దతు, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్‌లో ఇటలీ చేరికను ప్రధాని మోదీ అభినందించారు. 

click me!