మలేషియా నేవీ వార్షికోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గాల్లో ప్రదర్శనలు ఇస్తున్న హెలికాప్టర్లు ఢీకొన్ని చాలామంది ప్రాణాలు బలయ్యాయి. ఈ హెలికాప్టర్ల ప్రమాదం వీడియో వైరల్ గా మారింది.
మలేషియాలో ఘోరం జరిగింది. ఆ దేశ మిలిటరీ హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు బలయ్యాయి. మలేషియా నెవీ 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ మలేషియా నేవీ హెలికాప్టర్లు గాల్లో ప్రదర్శన చేస్తుండగా రెండు హెలికాప్టర్లు బాగా దగ్గరకు రావడంతో ప్రమాదం జరిగింది.
ఈ హెలికాప్టర్ల ప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోయినట్లు మలేషియా అధికారులు ప్రకటించారు. నెవీ హెలికాప్టర్లు ఢీకొనగా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
undefined
ఈ వీడియో ప్రకారం... కొన్ని హెలికాప్టర్లు గాల్లో చక్కర్లుకొడుతూ ప్రదర్శన ఇస్తున్నారు. ఇలా వేగంగా దూసుకెళుతున్న ఓ హెలికాప్టర్ లో సాంకేతిక లోపమో లేక మానవ తప్పిదమో తెలియదుగానీ మరో హెలికాప్టర్ కు దగ్గరగా వెళ్లింది. దీంతో రెండు విమానాలు పరస్పరం ఢీకొని పొగలు కక్కుతూ కిందపడిపోయాయి.
BREAKING: 2 military helicopters crash after mid-air collision in Malaysia, killing all 10 people on board pic.twitter.com/4afNggr0x9
— BNO News (@BNONews)
ఈ ప్రమాదంలో చనిపోయిన 10 మంది వివరాలు తెలియాల్సి వుంది. వీరంతా మలేషియా ఆర్మీకి చెందినవారే అయివుంటారు. నేవీ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఈ ప్రమాదం మలేషియా ప్రజల్లో ఆవేదన నింపింది.