Health Tips: 12-3-30 వర్కౌట్‌తో ఎన్నో బెనిఫిట్స్.. ఎలా చేయాలంటే..?

Published : Jun 02, 2025, 10:13 AM IST

12 3 30: అధిక బరువు ఉన్నవారు బాడీ ఫిట్ గా, హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. అందుకు క్రమ బద్ధంగా వ్యాయామం చేయాలి. మరి ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు 12-3-30 వర్కౌట్‌ చేస్తే.. త్వరగా వెయిట్ లాస్ కావడమే కాకుండా ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయట. 

PREV
14
12-3-30 వర్కౌట్‌

బరువు తగ్గడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అందులో ఎక్కువ మంచి నడకకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. త్వరగా బరువు తగ్గాలంటే.. 12-3-30 నడక పద్ధతి  ద్వారా బరువు తగ్గించుకోవచ్చంట. అది ఎలాగో చూద్దాం.  

24
12-3-30 వర్కౌట్‌ అంటే

12-3-30 వర్కౌట్‌ అంటే ట్రెడ్‌మిల్‌పై 12% డిగ్రీల వాలుతో గంటకి 3 మైళ్ల వేగంతో 30 నిమిషాల పాటు నడవడం. దీన్నే 12-3-30 వాకింగ్ పద్ధతి అంటారు. ఈ వర్కౌట్‌ని 2019లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లారెన్ గిరాల్డో రూపొందించారు.  

34
ప్రత్యామ్నాయ పద్ధతి

ట్రెడ్‌మిల్ లేనివారు వాలు ప్రాంతంలో వేగంగా నడవవచ్చు. సమతలంగా కాకుండా వాలు కొండపైకి ఎక్కి దిగవచ్చు. మెట్లు ఎక్కడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. 

44
ప్రయోజనాలు

వాలుగా నడవడం వల్ల కాళ్ళు, దిగువ శరీర కండరాలు బలపడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories