Heart attack: బీపీ ఎంత దాటితే.. గుండెపోటు వస్తుందో తెలుసా?

Published : Jun 01, 2025, 11:10 AM IST

Heart Attack: ఇటీవల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. వారిని పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా బీపీ పెరగడం వల్ల గుండెపోటు వస్తుందని తెలుసు. కానీ బిపి ఎంత పెరిగితే గుండెపోటు వస్తుందో తెలుసా?

PREV
17
ఆకస్మిక గుండెపోటు

సరిగా లేని ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి వల్ల అధిక రక్తపోటు (బీపీ) సమస్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి.  

27
అధిక రక్తపోటు

అధిక రక్తపోటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు (health issues) మొదలవుతాయి. ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండెపోటుకి ప్రధాన కారణం.

37
గుండెపోటు ఇంత ప్రమాదమా?

రక్తపోటు (blood pressure) గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని మీకు తెలుసు. కానీ బిపి ఎంత పెరిగితే గుండెపోటు వస్తుందో తెలుసా? దాని గురించి ఇక్కడ సమాచారం.

47
బీపీ నియంత్రణ

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చాలామంది రోగులు అధిక రక్తపోటు వల్ల గుండెపోటుకు గురవుతున్నారు. రక్తపోటు సమస్యను సరిగ్గా నియంత్రించకపోతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

57
గుండెపోటు ప్రమాదం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తపోటు 180/120 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది. లేదంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

67
ఆరోగ్య పరీక్షలు

హై బీపీ ఉన్నవారు ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. తరచుగా హెల్త్ చెక్-అప్ చేయించుకోవడం ఉత్తమం. రక్తపోటు పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

77
ఈ నియమాలు పాటించండి

మీ ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారం, జీవనశైలి (lifestyle) పై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, వ్యాయామం చేయండి, ఒత్తిడి లేని జీవితం గడపండి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories