Milk : వీళ్లు పొరపాటున కూడా పాలు తాగకూడదు.. ఎందుకంటే?

Published : Jun 01, 2025, 09:24 AM IST

Milk Side Effects:  పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు తాగితే.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంతకీ పాలు ఎవరు తాగకూడదు?

PREV
16
పోషకాల నిధి

పాలు పోషకాలతో నిండి ఉంటాయి. కానీ, అందరికీ మంచివి కావు. కొంతమందికి పాలు హానికరంగా మారవచ్చు. మీ శరీర అవసరాలను తెలుసుకుని, పాలు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి

26
వారికి జీర్ణం కావు

లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారిలో లాక్టేజ్ ఎంజైమ్ తగినంతగా లేకపోవడం వల్ల పాలలోని లాక్టోస్ (చక్కెర) జీర్ణం కాదు. లాక్టేజ్ ఎంజైమ్ లాక్టోస్‌ను విచ్ఛిన్నం చేసి, జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. 

36
అలెర్జీ

పాల అలెర్జీ ఉన్నప్పుడు, శరీరం పాల ప్రోటీన్లను హానికరంగా భావించి, వాటికి వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ఇది అలెర్జీ ప్రతిచర్యకు దారితీస్తుంది

46
చర్మ సమస్యలు

పాలలోని హార్మోన్లు,  ప్రోటీన్లు కొంతమందిలో మొటిమలకు కారణం కావచ్చు. పాలలో ఉండే హార్మోన్లు సెబమ్ (చర్మం నూనె) ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఈ సమయంలో రంధ్రాలు మూసుకుని పోవడంతో మొటిమలు ఏర్పడుతాయి.   

56
జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు ఉన్నవారు  పాలు తాగడం వల్గ కడుపులో గ్యాస్,  అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా ప్రతి ఒక్కరికి కాదు. పాలు జీర్ణం చేసే సామర్థ్యం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది.

66
ఆరోగ్య సమస్యలు
పాలలోని కొవ్వులు, హార్మోన్లు బరువు పెరగడానికి, PCOS సమస్యలకు దారితీయవచ్చు.
Read more Photos on
click me!

Recommended Stories