Calorie Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీరు కేలరీల లోపంతో బాధపడుతున్నట్లే..

Published : Jul 07, 2025, 07:26 PM IST

Calorie Deficiency: శరీరానికి శక్తిని అందించడంలో కేలరీలు కీలక పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే  కేలరీలు, వినియోగించే కేలరీలు సమానంగా ఉన్నప్పుడు మన బాడీ వెయిట్ కంట్రోల్ గా ఉంటుంది. ఒకవేళ శరీరంలో కేలరీలు తక్కువగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో? 

PREV
16
కేలరీల లోపం వల్ల వచ్చే సంకేతాలు

బరువు తగ్గే ప్రయత్నాల్లో చాలామంది తక్కువ కేలరీలు తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బరువు త్వరగా తగ్గడానికి తక్కువ కేలరీలు తీసుకోవడం మంచిదే. కానీ,  శరీరానికి అవసరమైన కేలరీలు అందకపోతే దుష్ప్రభావాలు ఎదురవుతాయి. శరీరంలో తగినంత కేలరీలు  లేకపోతే,.. ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతింటుంది. ఈ కథనంలో శరీరంలో కేలరీల లోపాన్ని చూపే ముఖ్య సంకేతాలు ఏవో తెలుసుకుందాం.

26
జుట్టు రాలడం;

జుట్టు రాలడం సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ, కేలరీల లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నట్టు అనిపించినా, తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీరం జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన, దృఢమైన జుట్టును కలిగి ఉండాలంటే, శరీరానికి తగినంత కేలరీలు అందించాలి. కాబట్టి మీ ఆహారంలో కేలరీలను సమకూర్చుకోండి. అప్పుడే జుట్టు రాలడం సమస్య ఆగి ఆరోగ్యకరమైన, దృఢమైన జుట్టును పొందుతారు.

36
చర్మ సమస్యలు:

చర్మం పొడిబారడం, పగుళ్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తే.. అది కేలరీల లేదా విటమిన్‌ల లోపం కావచ్చు. విటమిన్ E, C వంటి ముఖ్యమైన పోషకాలు, కేలరీల లోపం వల్ల చర్మ ఆరోగ్యం ప్రభావితమవుతుంది. బరువు తగ్గే ప్రక్రియలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ డైట్‌ను పునఃపరిశీలించి, అవసరమైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

46
రోగనిరోధక శక్తి తగ్గడం:

మీకు తరచూ దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు వస్తున్నాయా? అయితే ఇది సాధారణం కాదు. మీ శరీరానికి తగినంత పోషకాలు అందకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ముఖ్యంగా విటమిన్ C, విటమిన్ D, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీర రక్షణ వ్యవస్థకు చాలా అవసరం. కనుక తరచూ అనారోగ్యానికి లోనవుతున్నట్లయితే, మీ ఆహారాన్ని సమీక్షించండి, ఈ ముఖ్యమైన పోషకాలు కలిగిన ఆహారాన్ని చేర్చుకోండి. 

56
చలిగా అనిపించడం:

సాధారణ ఉష్ణోగ్రతలో కూడా మీకు చలిగా అనిపిస్తే, అది కేలరీల లోపం సంకేతం కావచ్చు. శరీరం వేడి ఉత్పత్తి చేయడానికి కేలరీల రూపంలో శక్తి అవసరం. తగినంత కేలరీలు అందకపోతే, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయలేక, చలిగా అనిపిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఎక్కువగా డైట్ నియమాలు పాటించేవారు ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశముంది. అందుకే, శరీర ఉష్ణోగ్రతలో మార్పులు కనిపించినప్పుడు, తీసుకునే డైట్ ను పునఃపరిశీలించాలి.

66
చిరాకుగా అనిపించడం:

మీకు ఎప్పుడూ చిరాకుగా అనిపిస్తే, లేదా తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే.. అది కేలరీల లోపం వల్ల కావచ్చు. శరీరానికి తగినంత శక్తి లేకపోతే,  నీరసంగా అనిపిస్తుంది. చిరాకు, అసహనం, ఏ పని మీదా దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆహారంలో కేలరీల మోతాదును సమతుల్యం చేయడం అవసరం.

గమనిక: పైన చెప్పిన సంకేతాలు ఏవైనా మీ శరీరంలో కనిపిస్తే వెంటనే మీ ఆహారంలో కేలరీలను పెంచండి.

Read more Photos on
click me!

Recommended Stories