AC Tips: వర్షాకాలంలో ఏసీ వాడటం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : Jul 07, 2025, 06:37 PM IST

AC Safety During Rain: వర్షాకాలంలో ఎయిర్ కండిషనర్ (AC) వాడొచ్చా ? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, వర్షంలో AC వాడటం సురక్షితమే, కానీ, కొన్ని విషయాలు గుర్తుంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. ఇంతకీ ఆ విషయాలేంటీ? పాటించాల్సిన జాగ్రత్తలేంటీ? 

PREV
16
వర్షంలో AC వాడొచ్చా?

వర్షాకాలంలో  ఉరుములు, మెరుపులు, వర్షం పడటం సహజమే. అయితే.. ఇలాంటి సమయంలో AC వాడొచ్చా? వాడితే ప్రమాదమా? అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, ఇంటి లోపల AC వాడటం సురక్షితం, కానీ ఉరుములు-మెరుపులు పడుతుంటే..  విద్యుత్ పరికరాలను తాత్కాలికంగా ఆఫ్ చేయడం ఉత్తమం.  అలాగే, సర్జ్ ప్రొటెక్టర్ వాడటం, ఇంటి వైరింగ్ సరిగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. మరిన్ని వివరాలు ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం!

26
వర్షం పడుతున్నప్పుడు AC వాడొచ్చా?

వర్షం పడుతున్నప్పుడు AC వాడటం సురక్షితమే. అయితే, తీవ్ర వర్షం, తుఫాను, లేదా చెడు వాతావరణ పరిస్థితుల్లో వాడితే.. కరెంట్ వినియోగం అధికమై బిల్లు పెరిగే అవకాశం. అలాగే, AC దెబ్బతినే ప్రమాదం ఉండొచ్చు. ముఖ్యంగా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురిసినప్పుడు భద్రతా సమస్యలు తలెత్తొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

36
భద్రతా నియమాలు

వర్షాకాలంలో మెరుపులు, ఉరుములు, కరెంట్ కోతలు సాధారణమే. అందువల్ల, ఈ సీజన్‌లో AC వాడేటప్పుడు కొన్ని భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలా చేస్తే AC పాడవకుండా, విద్యుత్ షాక్‌ వంటి ప్రమాదాలు తప్పించుకోవచ్చు. సర్జ్ ప్రొటెక్టర్ వాడటం, వాతావరణం తీవ్రంగా ఉన్నప్పుడు ACను తాత్కాలికంగా ఆఫ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

46
తేలికపాటి వర్షంలో

తేలికపాటి వర్షంలో AC వాడటం సాధారణంగా సురక్షితమే. AC లోని దుమ్ము, ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, భారీ వర్షం, తీవ్ర వాతావరణం, తరచూ కరెంట్ కోతలు, లేదా వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి పరిస్థితులు ఉంటే, AC కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి, దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో AC వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

56
AC డ్రైనేజ్ జాగ్రత్త తప్పనిసరి:

AC అవుట్డోర్ యూనిట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఉండడం అత్యంత అవసరం. లేకపోతే వర్షపు నీరు లేదా AC నుంచి బయటికి వచ్చే నీరు యూనిట్ చుట్టూ నిల్వ అయి, లోపలి వైరింగ్ పాడవడం, తడిగా మారడం వల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. అందువల్ల, నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

66
ప్రత్యామ్నాయం ఏమిటి? :

వర్షం పడుతున్నప్పుడు AC కి బదులుగా ఫ్యాన్ వాడండి లేదా కిటికీలు తెరవండి. ఇలా చేస్తే ఇల్లు చల్లగా ఉంటుంది, కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది.

ముఖ్య గమనిక: వర్షంలో AC పాడవకుండా, అవుట్డోర్ యూనిట్ లోకి దుమ్ము, ధూళి, నీరు పోకుండా దాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. వర్షం తర్వాత అవుట్డోర్ యూనిట్ లో ఏమైనా అడ్డంకులు, చెడిపోయిన భాగాలు ఉన్నాయా అని చూసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories