బెల్లీ ఫ్యాట్.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్సాహంగా ఉండలేరు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. త్వరగా అలిసిపోతుంటారు. అయితే కొన్ని మంచి అలవాట్లతో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని మంచి అలవాట్లతో బరువు తగ్గడమే కాదు.. పొట్టచుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు.
నాచురల్ డ్రింక్స్..
మనం రోజూ తాగే కొన్ని జ్యూస్‌లు, సోడాలు, టీ, కాఫీ వంటి పానీయాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ చక్కెర శరీరంలో కొవ్వుగా మారి పొట్ట పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి జ్యూస్‌లు తాగాలనుకుంటే ఇంట్లోనే చక్కెర లేకుండా తయారు చేసుకుని తాగడం మంచిది. నిమ్మకాయ, పుదీనా ఆకులు లేదా దోసకాయ ముక్కలను నీటిలో కలిపి డిటాక్స్ వాటర్ లా తాగచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి నాచురల్ డ్రింక్స్ తాగడం ఇంకా మంచిది.
25
మైదాతో చేసిన ఫుడ్స్ వద్దు!
మైదాతో చేసిన ఆహారాలు రుచిగా ఉన్నా ఆరోగ్యానికి మంచివి కావు. పరోటా, బన్, బిస్కెట్, కేక్, సమోసా వంటి బేకరీ పదార్థాల్లో మైదా ఎక్కువగా ఉంటుంది. మైదా జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తుంది. శరీరంలో కొవ్వును పెంచుతుంది. కాబట్టి మైదాకు బదులుగా గోధుమ పిండి, రాగులు, కొర్రలు, ఓట్స్ వంటి తృణధాన్యాలు వాడాలి. ఇడ్లీ, దోశ, చపాతీ వంటివి చేసేటప్పుడు తృణధాన్యాల పిండి వాడటం మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు.
35
ఫ్రైడ్ ఫుడ్స్ వద్దు!
నూనెలో వేయించిన పదార్థాల్లో కేలరీలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బజ్జీ, బోండా, చిప్స్, వడ, పూరి వంటివి రుచిగా ఉన్నా.. పొట్ట పెరగడానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోయి పొట్ట పెరుగుతుంది. వీలైనంత వరకు వేపుళ్లు మానేసి ఆవిరి మీద ఉడికించిన, కాల్చిన లేదా తక్కువ నూనెతో వండినవి తినాలి. కూరగాయల సలాడ్, సున్నుండలు, పండ్లు, గింజల వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం మంచిది.
ప్యాక్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్‌లలో ఉప్పు, కొవ్వు, రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. పొట్ట పెరగడానికి కూడా ఇవి కారణమవుతాయి. కాబట్టి వీటికి బదులు ఇంట్లో వండిన తాజా, పోషకమైన ఆహారం తినండి. చికెన్, చేప, గుడ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు తినడం మంచిది.
55
వ్యాయామం చేయడం..
ప్రతిరోజు 30-45 నిమిషాలు వేగంగా నడవడం వల్ల కూడా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నడక.. కేలరీలు, కొవ్వును కరిగిస్తుంది. లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం, దగ్గర ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.